E-Paper
Advertisement

హత్య జరిగిన ప్రతీ చోట నీలం రంగు పూల మొక్క… మిస్టీరియస్ కొరియన్ సిరీస్

హత్య జరిగిన ప్రతీ చోట నీలం రంగు పూల మొక్క… మిస్టీరియస్ కొరియన్ సిరీస్
Advertisement

Political Thriller: ఇన్వెస్టిగేటివ్ సైకో థ్రిల్లర్లు అంటే ఇష్టం లేని మూవీ లవర్స్ ఉండరేమో. సైకో హింట్స్ వదులుతూ మర్డర్స్ చేయడం, పోలీసులు వాడిని పట్టుకోవడం కోసం వేటాడడం, ఒక్కో క్లూను చేదిస్తూ చివరకు కిల్లర్ దగ్గరకు చేరుకోవడం… ఇలా సీన్ టూ సీన్ క్లైమాక్స్ వరకు కళ్ళు తిప్పుకోనివ్వనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటి థ్రిల్లర్స్. ఇక ‘లిటిల్ ఉమెన్’ (Little Women) అనే కొరియన్ సిరీస్ కూడా ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది. 2022లో విడుదలైన ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుండా పదండి.

కథలోకి వెళ్తే…

లూయిసా మే అల్కాట్ నవల ఆధారంగా ఈ సిరీస్ ను తీశారు. ఆధునిక కొరియాలోని ధనికుల రాజకీయ కుట్రలు, బ్లాక్ మనీ, ముగ్గురు పేద అక్కాచెల్లెళ్ల ధైర్య సాహసాల చుట్టూ తిరుగుతుంది. సిరీస్ లో ముగ్గురు సోదరీమణులదే కీలక పాత్ర. ఓ ఇన్-జూ పెద్దమ్మాయి. కుటుంబ బాధ్యతలు మోస్తూ, డబ్బు లేకపోతే సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో అనుభవించిన ఈమె, తన కుటుంబం గౌరవంగా బతకాలంటే భారీగా డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తుంది. ఇక రెండో అమ్మాయి పేరు ఓ ఇన్-క్యాంగ్. ఆమె నిజాయితీ గల జర్నలిస్ట్. డబ్బు కంటే నిజాయితీ, చట్టం ముఖ్యం అని నమ్ముతుంది. మూడో అమ్మాయి పేరు ఓ ఇన్-హై. ఆర్ట్స్ కాలేజీలో చదివే అద్భుతమైన పెయింటర్ ఈ చిన్నమ్మాయి. తన అక్కల త్యాగాలను, పేదరికం చూసి విసిగిపోయి, ఎలాగైనా ఆ జీవితం నుండి బయటపడాలని అనుకుంటుంది.

Advertisement

ఇక్కడే కథలో 70 బిలియన్ వోన్ల మిస్టరీ ట్విస్ట్ వస్తుంది. ఒక ఆఫీసులో అకౌంటెంట్‌గా పనిచేసే పెద్దక్కకు, ఆమె స్నేహితురాలు హఠాత్తుగా చనిపోతూ 70 బిలియన్ కొరియన్ వోన్ల నల్లధనాన్ని వదిలి వెళ్తుంది. ఆ డబ్బును దక్కించుకోవడంతో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. అయితే ఆ డబ్బు వెనుక కొరియాలోనే అత్యంత శక్తివంతమైన, క్రూరమైన ఒక రాజకీయ కుటుంబం ఉందని వారికి తెలుస్తుంది. ఆ కుటుంబం కొరియాను శాసిస్తున్న ఒక రహస్య సంఘాన్ని నడుపుతుంటుంది.

ఎక్కడ హత్య జరిగినా అక్కడ ఒక వింతైన ‘బ్లూ ఆర్కిడ్’ (నీలం రంగు పూల మొక్క) కనిపిస్తూ ఉంటుంది. రెండో చెల్లెలు ఇన్-క్యాంగ్ తన జర్నలిజం పవర్‌ తో ఆ రాజకీయ కుటుంబం చేసిన అవినీతిని, హత్యలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. చిన్న చెల్లెలు ఇన్-హై తెలియకుండానే ఆ విలన్ కూతురితో స్నేహం చేసి వారి ఇంట్లోనే ఇరుక్కుపోతుంది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తెలివితేటలతో ఆ మహా సామ్రాజ్యాన్ని ఎలా ఎదిరించారు ? ఆ 70 బిలియన్ల డబ్బు చివరికి ఏమైంది ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ పై ఓ లుక్కేయాల్సిందే. 12 ఎపిసోడ్‌ల ఈ కొరియన్ సిరీస్ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో లేదు.

Advertisement

Read Also : సైకో తమ్ముడి కోసం హాస్పిటల్ నే తగలబెట్టే నర్స్… ఐకానిక్ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×