Akhil Akkineni: అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి రచన దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లెనిన్. గెటప్ శ్రీను, రామ్ కీ, సుదర్శన్, బ్రహ్మాజీ, శివాజీ, ఈశ్వరీ రావు, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో అఖిల్ మాస్ రగ్గడ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి తారలు సినిమాపై పాజిటివ్ రియాక్షన్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా లవర్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న అఖిల్.. తాజాగా తన మాజీ వదిన సమంత గురించి, ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా సమంత మా ఇంటి బంగారం సినిమా చూశారా? అందులో సమంత పర్ఫామెన్స్ ఎలా ఉంది ? అని ప్రశ్నించగా.. అఖిల్ మాట్లాడుతూ..” నేను ఇంకా మా ఇంటి బంగారం సినిమాలో చూడలేదు. అయితే సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా ఇంటి బంగారం ట్రైలర్ మాత్రం చూసాను. అందులో సమంత యాక్టింగ్ వేరే లెవెల్. ఈ ట్రైలర్ చూడగానే కచ్చితంగా ఈ సినిమా హిట్టు కొడుతుందని నాకప్పుడే అనిపించింది. అద్భుతమైన ప్రయత్నానికి సమంతతో పాటు చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ తన మాజీ వదిన సమంత పై ప్రశంసలు కురిపించారు అఖిల్. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అయితే నాగచైతన్య తో బంధాలు తెగిపోయినప్పటికీ ఆయన కుటుంబంతో ఇప్పటికీ సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే సుప్రియతో మంచి రిలేషన్ కొనసాగిస్తున్న ఈమె.. అటు అఖిల్ తో కూడా చనువుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక తన మాజీ వదినపై ఇప్పుడు అఖిల్ ఇలా పాజిటివ్ గా ఓపెన్ కామెంట్లు చేయడంతో అటు అక్కినేని అభిమానులు, ఇటు సమంత అభిమానులు ఈ విషయాలను తెగ వైరల్ చేస్తున్నారు.
also read:ఓటీటీనే మోసం చేసిన డైరెక్టర్ కి భారీ షాక్.. !
లెనిన్ విషయానికి వస్తే.. ప్యూర్ రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అఖిల్ అక్కినేని తనను తాను నిరూపించుకోబోతున్నారు. పైగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని అఖిల్ కి స్టార్ డంను అందివ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.