OTT Movie : అందరి జీవితంలో ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. వీటిలో కొన్ని సక్సెస్ అవుతాయి, మరికొన్ని ఫైల్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో లవ్ సక్సెస్ అయినా, లైఫ్ ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని హీరో ఎలా హ్యాండిల్ చేశాడనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘లవ్ లి‘ (lovely). 2024 లో రిలీజ్ అయిన ఈ కన్నడ మూవీకి చేతన్ కేశవ్ దర్శకత్వం వహించారు. అభువనస క్రియేషన్స్ పతాకంపై రవీంద్ర కుమార్ నిర్మించారు. ఈ మూవీలో వశిష్ట ఎన్.సింహా, స్టెఫీ పటేల్, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్, సాధు కోకిల, సమీక్ష, కావ్య శెట్టి నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జనని అనే అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా, కొందరు రౌడీలు అసభ్యంగా మాట్లాడతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ జై అని తెలుసుకుని భయపడతారు. ఎందుకంటే జై అప్పటికే పెద్ద రౌడీగా ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని, వాళ్ళందరినీ జై చంపేస్తాడు. జననిని ఎంత ఇష్టంగా ప్రేమిస్తాడో, చెప్పడానికే కష్టంగా ఉంటుంది. ఇంట్లో వాళ్లు వీళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, బయటికి వచ్చిన జనని, జై ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరి జీవితం హాయిగా నడుస్తుంది. జనని ప్రెగ్నెంట్ అవడంతో ఆమెను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యని చూసి బాధపడతాడు. పుట్టిన బిడ్డని తిట్టడం మొదలుపెడతాడు. నీవల్లే నా భార్య బాధపడిందని అంటుంటే, అతనికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అలా వీళ్ళిద్దరికీ పుట్టిన పాపకి పాయల్ అనే పేరు పెట్టుకుంటారు.
కొద్దిరోజుల తర్వాత జనని అనారోగ్యంతో బాధపడుతుంది. డాక్టర్లు చెక్ చేసి ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని చెప్తారు. జై డాక్టర్ మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఆమెకు ఇది ఎలా వచ్చిందో తెలియక సతమతమవుతాడు. అయితే ఆమెకు లండన్ లో ట్రీట్మెంట్ చేయిస్తే జబ్బు తగ్గే అవకాశం ఉందని డాక్టర్ చెబుతుంది. తన భార్యకు హెచ్ఐవి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక వ్యక్తి మీద అనుమానంతో అతన్ని ఫాలో అవుతాడు. ఈ క్రమంలో హీరోకి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. చివరికి హీరో తెలుసుకున్న విషయాలు ఏమిటి? తన భార్యకు ఆ జబ్బు ఎలా వచ్చింది? లండన్ లో ఆమెకు నయం అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లవ్ లి’ (lovely) అనే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని చూడాల్సిందే.