OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రవీనా టాండన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. భార్య, భర్తల మధ్య మరొక వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో సినిమా (Jio Cinema) లో
2023 లో వచ్చిన ఈ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వన్ ఫ్రైడే నైట్‘ (One Friday night). జియో స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీకి మనీష్ గుప్తా దర్శకత్వం వహించారు. రవీనా టాండన్, మిలింద్ సోమన్, విధి చితాలియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 28 జూలై 2023న జియో సినిమాలో డైరెక్ట్ గా విడుదలైంది. చాలా సన్నివేశాలను సహజమైన వర్షంలో , మంచి అనుభూతిని కలిగించేలా చిత్రీకరించారు దర్శకుడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
లత గైనకాలజిస్ట్ గా ఒక హాస్పిటల్లో తన వృత్తిని నిర్వహిస్తూ ఉంటుంది. ఈమె భర్త రామ్ ఒక బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఉంటాడు. 20 సంవత్సరాలు దాటినా వీళ్లకు పిల్లలు పుట్టకుండా ఉంటారు. అయితే ఒకరిని ఒకరు బాగానే ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోని నీరు అనే అమ్మాయిని రామ్ ఇష్టపడతాడు. భార్యకి బిజినెస్ పని అని చెప్పి, నీరుని తన గెస్ట్ హౌస్ కి తీసుకొని పోతాడు. అక్కడికి వెళ్లాక నీరు తను ప్రెగ్నెంట్ అని రామ్ కి చెప్తుంది. ఇది తెలిసి రామ్ చాలా సంతోషిస్తాడు. అయితే నీరు మాత్రం తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. కొద్దిరోజులు ఆగాలని రామ్ చెప్తున్నా వినకుండా నీరు గొడవపడుతుంది. ఈ పెనుగులాటలో రామ్ బిల్డింగ్ నుంచి పొరపాటున కింద పడతాడు. తలకు దెబ్బ తగిలి బాగా రక్తం కారుతుంది. ఇంట్లో వాచ్మెన్ కూడా బయటికి వెళ్లడంతో, ఎవరికి ఫోన్ చేసినా రాత్రి కావడంతో ఎవరూ లిఫ్ట్ చేయరు. అంబులెన్స్ కాల్ కూడా కలవకపోవడంతో, చివరికి లతా కి ఫోన్ చేస్తుంది నీరు.
ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో నువ్వు ఎందుకు ఉన్నావు అంటూ అడుగుతుంది లత. విషయం లతా కు తెలియడంతో చాలా బాధపడుతుంది. లత గెస్ట్ హౌస్ కి వచ్చి, తన భర్తకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పిస్తుంది. మెలుకువ లోకి వచ్చిన భర్త, నీరు అంటే నాకు చాలా ఇష్టమని లతకు చెప్తాడు. లత నేను డైవర్స్ ఇస్తానంటూ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన వాచ్మెన్ పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు లత కి ఫోన్ చేసి రామ్ చనిపోయాడని చెప్తారు. పోలీసులు ఈ హత్య నీరు చేసిందని అరెస్ట్ చేస్తారు. చివరికి రామ్ ని ఎవరు చంపుతారు. లతకి ఈ క్రైమ్ లో సంబంధం ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీనీ చూసేయండి.