Meerpet Murder Forensics | హైదరాబాద్ లోని మీర్‌పేట్ ప్రాంతంలో మాదవి అనే మహిళను ఆమె భర్త గురుమూర్తి దారుణంగా హత్య చేసిన ఘటనలో ప్రతి రోజు కొత్త వివరాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి తన భార్యను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని వేడి నీటిలో ఉడికించి, డ్రైనేజీ ద్వారా విసర్జించినట్లు
పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య తర్వాత చేసిన గురుమూర్తి చేసిన షాకింగ్ పనుల గురించి పోలీసులు వివరాలు వెల్లడించారు.
ముక్కలు ముక్కలుగా నరికి
భార్య శవాన్ని బాత్రూమ్‌లోకి గురుమూర్తి తీసుకెళ్లాడు. అక్కడ కూర్చుని, శరీరాన్ని ముక్కలుగా నరికి, వాటిని విడదీసాడు. ముందుగా చేతులు, తర్వాత కాళ్లు నరికి, వాటిని రెండు భాగాలుగా చేసి బకెట్లో వేశాడు.
Also Read: మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. ఇన్‌ఫ్రారెడ్ ద్వారా రక్తపు మరకలు గుర్తింపు
వేడినీటిలో రసాయనాలతో శవముక్కలను ఉడికించాడు
మాధవి మృతదేహాన్ని ముక్కలుగా చేశాక.. 25 లీటర్ల పెయింట్ డబ్బాలో నీటిని వేడి చేసి, శరీర ముక్కలను ఉడికించాడు. మాంసం, ఎముకలు త్వరగా వేరుగా అయ్యేందుకు పోటాషియం హైడ్రాక్సైడ్‌ను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రైనేజీలో శరీర శవభాగా అవశేషాలు
శరీరాన్ని మెత్తగా చేసి, వాటిని టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేశాడు. ఎముకలను పెద్ద కమర్షియల్ స్టౌవ్‌పై (పెళ్లిళ్లలో వంటల కోసం ఉపయోగించే పెద్ద స్టవ్) కాల్చాడు. ఆ తరువాత రోకలిలో ఎముకలు వేసి దంచి పొడిగా చేశాడు. ఆ పొడినంతా చివరగా డ్రైనేజీలో పడేశాడు.
బ్లూ రే టెక్నాలజీతో ఆధారాలు సేకరించిన పోలీసులు
బ్లూ రే టెక్నాలజీ సాయంతో గురుమూర్తి ఇంట్లో నుంచి సేకరించిన ఆధారాలతో పోలీసులు విశ్లేషించారు. జనవరి 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్స్‌తో పాటు సీసీ కెమెరాలో రికార్డు ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. వాటిని పరిశీలించి కీలక ఆధారాలను సంపాదించారు.
ఫోరెన్సిక్ అనాలసిస్:
ఈ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి మరిన్ని ఆధారాలను సేకరించేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఈ షాకింగ్ మర్డర్ కేసు విచారణలో ప్రధాన ఫోరెన్సిక్ ల్యాబ్‌ల సహకారంతో పోలీసులు పని చేస్తున్నారు.
మీర్ పేట్ లో నివసించ మాజీ సైనికుడు గురుమూర్తి.. హైదరాబాద్ లో ఒక సెక్యూరిటీ సిబ్బందిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో ఒంటరిగా ఉన్న తన భార్యతో గొడవ పడిన గురుమూర్తి.. ఆ గొడవలో భార్యను హత్య చేశాడు. ఆ తరువాత ఆమె శవాన్ని మాయం చేసేందుకు భారీ ప్లానింగ్ చేశాడు.