BigTV English

OTT Movie : ప్రియురాలి కోసం అలాంటి పని చేసే హీరో… కానీ మరొకరితో కలిసి హ్యాండ్ ఇచ్చే హీరోయిన్…

OTT Movie : ప్రియురాలి కోసం అలాంటి పని చేసే హీరో… కానీ మరొకరితో కలిసి హ్యాండ్ ఇచ్చే హీరోయిన్…

OTT Movie : ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. మనసుకు హాయిగా అనిపించే ఏ సినిమా అయినా, థియేటర్లలో మంచి విజయాలను అందుకుంటుంది. అటువంటి మూవీ ఒకటి థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ లవ్ డ్రామా మూవీ పేరు ‘లవర్‘ (lover). 2022 లో వచ్చిన ఈ పంజాబీ మూవీకి దిల్షేర్ సింగ్ & ఖుష్పాల్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కెవి ధిల్లాన్ నిర్మించగా, ఇందులో గురి, రోనక్ జోషి, యశ్‌పాల్ శర్మ, అవతార్ గిల్ నటించారు. ఈ మూవీ 1 జూలై 2022 న థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో కాలేజ్ కి వెళ్లే క్రమంలో ఆటోను శుభ్రం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆటోలో తను ప్రేమించే అమ్మాయి కూర్చుంటుంది. అంతలా హీరో ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. దూరం నుంచి తనను ప్రేమిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. రాహుల్ అనే వ్యక్తి కూడా హీరోయిన్ వెంటపడుతూ ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ వెంట హీరో పడుతున్నప్పుడు, రాహుల్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. హీరో నేను తనకోసం ఏమైనా చేస్తానంటూ, చేయి కూడా కోసుకొని హీరోయిన్ పేరు రాసుకుంటాడు. అప్పటినుంచి హీరోయిన్, హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. ఈ విషయం హీరోయిన్ బాబాయ్ దిలావర్ కి తెలుస్తుంది. హీరోకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దిలావర్. ఎంతకీ వీరిద్దరూ వినకపోవడంతో, హీరోయిన్ కి దిలావర్ పెళ్లి చేయాలనుకుంటాడు. ఆమె తండ్రి చనిపోవడంతో బాబాయ్ అయిన దిలావర్ ఇంటిని చూసుకుంటూ ఉంటాడు. హీరోని కూడా ఇంట్లో తల్లిదండ్రులు బంధిస్తారు.

ఆ తర్వాత హీరోయిన్ కి పెళ్లి అయిపోయిందని హీరో విషం తాగుతాడు. ప్రాణాలతో బయటపడి తాగుబోతుగా మారుతాడు హీరో. కొంతకాలం అయినాక హీరో ఒక హోటల్లో సర్వర్ గా చేరుతాడు. మొదట ఈ పనికి ఒప్పుకోకపోయినా, అక్కడ తాగడానికి మందు దొరుకుతుందని తెలుసుకొని వెళ్తాడు. అక్కడ తాగి హీరోయిన్ ను గుర్తుచేసుకొని పాట పడతాడు. ఆ పాట ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి నచ్చడంతో అతనికి ఒక అవకాశం ఇచ్చి, సినిమాలలో ఒక పాటను కూడా పాడిస్తాడు. అందుకు గాను హీరోకి కొంత డబ్బును కూడా ఇస్తాడు. హాస్పిటల్ కి ఒక పని మీద వచ్చిన హీరోకి, హీరోయిన్ బెడ్ మీద జీవచ్ఛవంలా పడుకుని ఉండటం చూస్తాడు. ఇది చూసిన హీరో బోరున విలపిస్తాడు. చివరికి హీరోయిన్ హాస్పిటల్లో ఎందుకు ఉంటుంది? వీళ్ళిద్దరి ప్రేమ చివరికి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘లవర్’ (lover) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : దొంగ పేర్లతో అమ్మాయిలతో ఆడుకునే సైకో… హీరోనే విలన్ అయితే… మైండ్ బెండయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆచారాల పేరుతో అమ్మాయిలతో ఏకాంతంగా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

Big Stories

×