రివ్యూ : పాతాళ్ లోక్ సీజన్ 2
నటీనటులు : జైదీప్ అహ్లావత్, ఇష్వాక్ సింగ్, తిలోత్తమ షోమ్, నగేష్ కుకునూర్, జహాను బారువా తదితరులు.
దర్శకుడు : అవినాష్ అరుణ్
నిర్మాతలు : కర్నేష్ శర్మ, సుదీప్ శర్మ
మొత్తం ఎపిసోడ్స్ : 8
Paatal Lok Season 2 Review and Ratinh : జైదీప్ అహ్లావత్, ఇష్వాక్ సింగ్, తిలోత్తమ షోమ్, నగేష్ కుకునూర్, జహాను బారువా తదితరులు కీలక పాత్రలు పోషించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్ 2’. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండవ సీజన్ గురించి ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. దాదాపు ఇదేళ్ల గ్యాప్ తరువాత, జనవరి 17న మోస్ట్ అవెయిటింగ్ సీక్వెల్ ‘పాతాళ్ లోక్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకుందా ? ఐదేళ్ల నిరీక్షణకు ‘పాతాళ్ లోక్ 2’ వర్త్ అన్పించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ
ఢిల్లీకి చెందిన ఒక పొలిటికల్ లీడర్ హత్యతో స్టోరీ మొదలవుతుంది. నాగాలాండ్ బిజినెస్ సమ్మిట్ జరుగుతుండగా ఢిల్లీ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ ను దారుణంగా హత్య చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ ఇమ్రాన్ హన్సారికి ఈ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ ని పై అధికారులు అప్పజెప్తారు. ఇంకో వైపు హాథిరామ్ చౌదరి జమునా పార్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తుంటాడు. ఓ మహిళ తన భర్త మిస్ అయ్యాడు అంటూ చేసిన కంప్లైంట్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలోనే చనిపోయిన రాజకీయ నాయకుడి మర్డర్ కేసు, ఆ మహిళ భర్త మిస్సింగ్ కు లింక్ ఉందన్న విషయాన్ని ఇమ్రాన్, హాథిరామ్ కనిపెడతారు. మరి ఆ తర్వాత ఈ రెండు కేసుల ఇన్వెస్టిగేషన్ ఎలాంటి మలుపు తిరిగింది? భర్త మిస్ అయ్యాడు అంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఆ మహిళ ఎవరు? అతనికి చనిపోయిన పొలిటికల్ లీడర్ కు ఉన్న లింక్ ఏంటి? అతను ఎలా మిస్ అయ్యాడు? అసలు ఆ రాజకీయ నాయకుడిని చంపింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ‘పాతాళ్ లోక్ సీజన్ 2’ను ఓటిటిలో చూడాల్సిందే.
విశ్లేషణ
పాతాళ లోక్ సీజన్ 1 అంత పెద్ద హిట్ కావడానికి కారణం టేకింగ్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. మొదటి సీజన్ మొత్తం హత్యకు గురికాబోయే జర్నలిస్ట్ పై చేసే దర్యాప్తుతో ఆసక్తికరంగా సాగుతుంది. అయితే రెండో సీజన్ మాత్రం అందుకు భిన్నంగా పొలిటికల్ లీడర్ మర్డర్ అయ్యాక ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. మొదటి సీజన్ మొత్తం ఢిల్లీలో నడిస్తే, రెండవ సీజన్ నాగాలాండ్ నేపథ్యంలో కొనసాగుతుంది. ఓ రాజకీయ నాయకుడి హత్య చుట్టూ వివిధ క్రైమ్స్ ను అల్లి ‘పాతాళ్ లోక్ సీజన్ 2’ని రూపుదిద్దారు. ఇక మొదటి సీజన్ హిట్ అనిపించుకోవడానికి మెయిన్ రీజన్ హాథిరామ్ చౌదరి పాత్ర అని చెప్పొచ్చు. అందుకేనేమో సెకండ్ సీజన్ లో కూడా అతని పాత్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
కానీ ఈ సెకండ్ సీజన్లో కొన్ని చోట్ల మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ అంతా రొటీన్ గా అనిపిస్తుంది. ఈ సిరీస్ లో హాథిరామ్ చెప్పే కొన్ని డైలాగులు, సినిమాటోగ్రఫీ, యాక్షన్స్ సీన్స్, బిజీఎం బాగున్నాయి. కానీ కొన్ని ఎపిసోడ్స్ ఏకంగా 40 నుంచి 45 నిమిషాల రన్ టైమ్ తో సాగదీసిన ఫీలింగ్ తెప్పిస్తాయి. ఎప్పటిలాగే నటీనటుల విషయానికొస్తే జైదీప్ అహ్లావత్ ఈసారి కూడా తన పర్ఫామెన్స్ తో హైలెట్ గా నిలిచాడు. మిగతా నటినటులు పర్వాలేదనిపించారు. ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ ను అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి రూపొందించారు. రచయిత-దర్శకుడు సుదీప్ శర్మ మీద నమ్మకంతో ఆమె ఈ సిరీస్ ను చేసింది. అది వర్కౌట్ అయ్యింది కూడా. కానీ సీక్వెల్ విషయంలో ఈ టీమ్‌లో అనుష్క లేదు. ఒక్కడే నిర్మాత అయిన కర్నేష్‌కి తన టీమ్ పై పెద్దగా కంట్రోల్ ఉన్నట్టుగా ఉన్నట్లుగా అన్పించదు సిరీస్ చూశాక. లేదు. ఈ సిరీస్ ఢిల్లీ అండర్ వరల్డ్ నుంచి నార్త్ ఈస్ట్ మాఫియా ప్రపంచానికి మారింది. దాని ఫలితం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాత్రం లేదు.
ప్లస్ పాయింట్స్ :
ఎపిసోడ్స్ రన్ టైమ్
సాగదీసిన సన్నివేశాలు
స్క్రీన్ ప్లే
ప్లస్ పాయింట్స్ :
డైలాగులు
సినిమాటోగ్రఫీ
యాక్షన్స్ సీన్స్
బిజీఎం
మొత్తంగా… ‘పాతాళ్ లోక్ సీజన్ 1’ ను చూసిన ఉత్సాహంతో, భారీ అంచనాలతో ఈ సీజన్ ని చూసారంటే నిరాశ తప్పదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి, ఎలాంటి అంచనాలు లేకుండా చూసేవారికే ‘పాతాళ లోక్ సీజన్ 2’.
Paatal Lok 2 Rating : 2/5