Mad Square OTT : యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’.. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యిన మూవీ ఇది. 2023 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ ఇది అయితే థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ కన్నా ఓటీటీలోనే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అంతకు మించి భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ థియేటర్లలోకి వచ్చింది.. కళ్యాణ్ శంకరే సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించారు. ఉగాది పండగ కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక లుక్ వేద్దాం పదండీ…
‘మ్యాడ్ స్క్వేర్ ‘ ఓటీటీ డీటెయిల్స్..
గతంలో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది.. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్‌శోభన్ హీరోలుగా నటించిన ఈ మూవీలో విష్ణు కీలక పాత్ర పోషించారు. సునీల్, మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషించారు. హిలేరియస్‌కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ ఆడియెన్స్ ని అలరించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ స్ సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ లో ప్రియాంక జువాల్కర్ మరో కీలక పాత్ర పోషించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, తమన్ బీజీఎమ్ సమకూర్చారు. థియేటర్లో సమ్మర్‌లో నవ్వులు పూయించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ఆడియెన్స్ ని అలరించబోతుంది. ఓటీటీ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయడానికి వస్తుంది.. మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఓటీటీ సంస్థ ప్రకటించింది.
Also Read:సింగర్ ప్రవస్తి విషయం పై సునీత భర్త సీరియస్.. సునీత క్షమాపణలు..
స్టోరీ విషయానికొస్తే..
మ్యాడ్‌కు కొనసాగింపుగానే ఈ సీక్వెల్ సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మూడేళ్ల తర్వాత డీడీ, అశోక్, మనోజ్ ఏం చేస్తున్నారది చూపిస్తూ కథను మొదలుపెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీపడేందుకు డీడీ చేసే పనులు నవ్విస్తాయి.. ఈ మూవీలో లడ్డు పెళ్లి హైలెట్ అవుతుంది. ఈ పెళ్లి తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్ వెళ్లడం ఇదంతా మూవీకి హైలెట్ అయ్యింది. ఇక పోతే ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో నిర్మించారు. కానీ థియేటర్లలో రిలీజ్ అయ్యి 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మ్యాడ్ స్క్వేర్ స్ట్రీమింగ్ కానుంది. కాగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ ఓటీటీలోకి రావడం గమనార్హం.థియేటర్లలో సక్సెస్ అయిన ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..