Drinks For Skin Glow: మీ కళ్ళ దగ్గర.. నుదిటిపై లేదా మీ నోటి చుట్టూ సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తే.. శరీరంలో కొల్లాజిన్ స్థాయి క్రమంగా తగ్గుతోందని అర్థం. కొల్లాజిన్ చర్మానికి మాత్రమే కాకుండా.. జుట్టు, గోర్లు, ఎముకలను బలంగా ఉంచడానికి కూడా చాలా ముఖ్యమైన ప్రోటీన్. వృద్ధాప్యంతో, కొల్లాజెన్ యొక్క సహజ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా ఇది ముడతలు, వదులుగా ఉండే చర్మం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది.
కొల్లాజెన్ స్థాయి తక్కువగా ఉండటం అనేది వయస్సుతో సంబంధం ఉన్న సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, మన ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పండ్ల రసాలను చేర్చుకోవడం ద్వారా ఈ ప్రక్రియను నెమ్మదిగా చేయవచ్చు. ఈ జ్యూస్ లు కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపు, యవ్వన రూపాన్ని ఇస్తాయి. మరి ఆ పండ్ల రసాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ రసం:
దానిమ్మలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఇవి కొల్లాజెన్ విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తాయి. కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. నారింజ రసం:
విటమిన్ సి సమృద్ధిగా ఉండే నారింజ రసం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది . అంతే కాకుండా ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడుతుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. ఫలితంగా చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. మీరు దీన్ని రోజుకు ఒకసారి తాగడం చాలా మంచిది.
3. క్యారెట్ , బీట్‌రూట్ రసం:
క్యారెట్ , బీట్ రూట్ లలో తయారు చేసిన జ్యూస్ లలో విటమిన్లు A, C, E , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి రిపేర్ చేస్తాయి. అంతే కాకుండా క్యారెట్ చర్మం పై పొరను మరమ్మతు చేస్తుంది. బీట్‌రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉదయం టిఫిన్, వ్యాయామం తర్వాత దీనిని తాగడం చాలా మంచిది.
4. కలబంద , ఉసిరి రసం:
కలబంద చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతే కాకుండా కలబందలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిసి చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తాయి. కొల్లాజెన్ స్థాయిలను నిర్వహిస్తాయి. ఖాళీ కడుపుతో రోజుకు 20-30 మి.లీ కలబంద జ్యూస్ తీసుకోవడం మంచి అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: సమ్మర్‌లో చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి !
5. కివి , స్ట్రాబెర్రీ జ్యూస్ :
ఈ రెండు పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దృఢంగా చేసి, ముడతలను తగ్గించి, చర్మానికి యవ్వనంగా మారుస్తాయి. స్నాక్స్ సమయంలో లేదా సాయంత్రం కొంచెం ఆకలిగా ఉన్నప్పుడు దీనిని తాగడం మంచిది.
6. కివి-స్ట్రాబెర్రీ జ్యూస్:
ఎల్లప్పుడూ జ్యూస్‌ను తాజాగా తయారు చేసుకుని చక్కెర లేకుండా తాగండి.
జ్యూస్‌లు తాగడంతో పాటు.. పుష్కలంగా నీరు , ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోండి.
ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ అప్లై చేయండి.