OTT Movie : ఫాంటసీ సినిమాలను ఎక్కువగా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. వీటిలో ఉండే సన్నివేశాలు, ఒక కొత్త ప్రపంచం చూసినట్టుగా ఉంటుంది. పిల్లలు ఈ సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మంత్రాలు, మాయలు ఉండే ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను పిచ్చెక్కిస్తూ ఉంటాయి. అలా మంత్రముగ్ధుల్ని చేసే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫాంటసీ మూవీ పేరు ‘ది మెజీషియన్స్ రైన్ కోట్‘ (The Magician’s rain coat). ముగ్గురు పిల్లలు ఒక మాయా రెయిన్ కోట్ ను కనుగొంటారు. అది వారిని దాని యజమాని, శాపగ్రస్తుడైన మెజీషియన్ శరీరంలోకి తీసుకువెళుతుంది. వారు రెయిన్ కోట్ రహస్యాన్ని ఛేదించి, ఆలస్యం కాకముందే దాని శాపాన్ని ఛేదించాలనుకొంటారు. ఈ ఫాంటసీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రిమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జేమ్స్ ఒక మ్యాజిక్ షో నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి ఒక థియేటర్ కూడా ఉంటుంది. ఆ థియేటర్ లోనే మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ థియేటర్ ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటాడు జేమ్స్. హోవర్డ్ అనే వ్యక్తి ఆ థియేటర్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. జేమ్స్ కి ఒక ఆఫర్ కూడా ఇస్తాడు. కాస్త టైం కావాలని హోవర్డ్ కి జేమ్స్ చెప్తాడు. జేమ్స్ మ్యాజిక్ చేస్తుండగా, అతని సీక్రెట్స్ బయట పెడతాడు హోవర్డ్. అప్పుడే ఆ థియేటర్ కి వచ్చిన ఒక అమ్మాయి, ఆభరణాన్ని దొంగలిస్తాడు జేమ్స్. ఆమె ఒక మంత్రగత్తె కావడంతో, జేమ్స్ ని శపిస్తుంది. అతడు కనిపించకుండా పోతాడు. జేమ్స్ వేసుకున్న రైన్ కోట్ మాత్రమే కింద పడుతుంది. ఆ తర్వాత స్టోరీ 86 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంటుంది. జాక్ స్కూల్ కి వెళ్తూ చదువుకుంటూ ఉంటాడు. జాక్ కి స్కూల్ లో ఇద్దరు స్నేహితుల తయారవుతారు.
స్కూల్ ప్రిన్సిపాల్ ఒక మంత్రగత్తే గా ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంది. స్కూల్లో పిల్లల శక్తుల్ని రహస్యంగా వాడుకుంటూ, తన శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు జాక్ ఫ్రెండ్స్ తో కలిసి, తన అమ్మమ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ జాక్ కి ఒక రైన్ కోట్ దొరుకుతుంది. ఆ రైన్ కోట్ వేసుకున్న వెంటనే, జేమ్స్ లా మారిపోతూ ఉంటాడు. ఎవరు వేసుకున్నా అలానే మారిపోతారు. ఆ రహస్యం తెలుసుకోవాలని జాక్ ఆ రైన్ కోట్ ని పరీక్షిస్తాడు. అందులో జేమ్స్ అనే పేరు రాసి ఉంటుంది. ఇంటర్నెట్లో ఆ పేరుతో సెర్చ్ చేయగా, అతడు ఒక మెజీషియన్ అని తెలుసుకుంటాడు. ఉన్నట్టుండి ఒకరోజు కనిపించకుండా పోయాడని తెలుసుకొని, అతని థియేటర్ వద్దకి వెళ్తాడు. చివరికి ఆ రైన్ కోట్ రహస్యాన్ని జాక్ చేదిస్తాడా? రైన్ కోట్ లో ఉన్న జేమ్స్ శాపాన్ని పోగొడతాడా? మంత్రగత్తె వల్ల వీళ్లకు ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.