E-Paper
Advertisement

Allu Arjun : పుష్ప రాజ్ కి ఆ ఫోబియా ఎప్పుడు తగ్గుతుందో…

Allu Arjun : పుష్ప రాజ్ కి ఆ ఫోబియా ఎప్పుడు తగ్గుతుందో…
Advertisement

Allu Arjun : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. గతంలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యింది. మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ నే అందుకుంది.. సినిమా పరంగా ఒకే కానీ ఈ మూవీ ప్రీమియర్ షోలో ఆర్టీసీ క్రాస్ వద్ద గల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ ఘటనతో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. అతని పై కేసు నమోదు అయ్యింది. దాంతో అల్లు అర్జున్ కు ఒక ఫోబియా పట్టుకుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఆ ఫోభియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. 

Advertisement

గత ఏడాది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యావత్ సినీ ప్రేక్షకుల ను కదిలించి వేసింది. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఓ మహిళ చనిపోయింది. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్‌ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్‌ అవ్వలేదు. మూడు నెలల నుంచి అలాగే ఆసుపత్రి బెడ్ మీద పడివున్నాడు. ఆ బాలుడు కోలుకొవాలని యావత్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటివి జరగడంతో అల్లు అర్జున్ భయపడి పోయాడు. ఏం జరిగింది? ఎలా జరిగింది? అని తేల్చుకోలేక పోతున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతుందా అని టెన్షన్ పడ్డాడు దాంతో ఆయన ఒక విచిత్ర ఫోభియా పట్టుకుంది.

అల్లు అర్జున్ కు ఫోభియా..? 

Advertisement

అల్లు అర్జున్ ప్రీమియర్ షో టైం లో ఎటువంటి పర్మిషన్ లేకున్నా కూడా పోలీసులు వద్దని లెటర్ ను పంపినా కూడా కిలో మీటర్ మేర రోడ్ షో చేస్తూ అభిమానులకు అభివాదం తెలిపాడు తమ అభిమాన హీరో వస్తున్నారని అక్కడ జనాలు చూసేందుకు ఎగబడ్డారు.. దాంతో థియేటర్లో గందరగోళం ఏర్పడింది.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళ చనిపోయింది. ఒకరు ప్రాణాలతో పోరాడుతున్నాడు. దీంతో బన్నీకి ఒక ఫోభియా పట్టుకుందట. జనాల్లోకి రావాలంటే భయంతో వణికిపోతున్నాడు. అందుకే నాగ చైతన్య తండేల్ ఈవెంట్ కు కూడా రాలేక పోయాడు.. ఎక్కడ తన వల్ల మళ్లీ తొక్కిసలాట జరుగుతుందో .. అని టెన్షన్లో ఉన్నాడు.. దానివల్లే జనాల్లోకి రాలేదు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం బాగా వినిపిస్తుంది. దీని పై బన్నీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×