Thandel Movie : అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఒక్కరోజు మాత్రమే ఉంది ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. సినిమా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మేకర్స్ గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై చైతుతో పాటు.. పూర్తి మూవీ టీమంతా పూర్తి నమ్మకంతో ఉన్నారు. సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. అన్ని భాషల్లో విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలోనే.. అక్కినేని ఫ్యాన్స్ అంత సినిమా కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నాతో మా హీరోకి హిటాక్ ని అందుకునేలా చేస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా సినిమా ఇన్‌సైడ్ వర్గాల టాక్ నెట్టింట వైరల్‌గా మారుతుంది..
తండేల్ హైలెట్స్..
*. సినిమాలో ఊహించిన దానికంటే ఎక్కువగా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయట. అందులోనూ.. సాయి పల్లవి, చైతు మధ్య నడిచే లవ్ ట్రాక్ మరింత హైలెట్ కానుందని చైతూ కెరీర్ లో ఇదే బెస్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
*. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట మెప్పించింది..
*. ట్రైలర్ లో చూపించిన పాకిస్తాన్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సీన్ సినిమా స్టోరీని మలుపు తిప్పుతుందని టాక్..
*. బోట్ యాక్షన్ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సాధారణంగా ఓ సినిమా అంటే ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ సన్నివేశాల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి…
*. ఇంటర్వెల్లో లాస్ట్ 25 నిమిషాల సీన్స్.. అలాగే ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేయడం ఖాయమని టాక్ నడుస్తుంది..
*. సాయి పల్లవి పెర్ఫార్మన్స్ సినిమా హిట్ అయ్యేలా చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ తో భారీ అంచనాలను ఎలా ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ మూవీ టికెట్ ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తుంది.. మొదటి వారం సింగిల్ స్క్రీన్ పై రూ.50.. మల్టీప్లెక్స్ రూ.75 పెంపుకు పర్మిషన్స్ లభించాయి. ఈ క్రమంలోనే ఏపీలో సింగిల్ స్క్రీన్ రూ.187 మల్టీప్లెక్స్ లో రూ.252 టికెట్ ధర ఉండగా.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ.177 మల్టీప్లెక్స్ లో.. రూ. 295 టికెట్ ధరలు పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మంచి టాప్ నందుకు ఈ మూవీ ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో? ఎలాంటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుందో? చూడాలి..