BigTV English

OTT Movie : ఈ మూవీ చూస్తే జన్మలో వాక్యూమ్ క్లీనర్ జోలికి వెళ్లరు… క్రేజీ మర్డర్ మిస్టరీ

OTT Movie : ఈ మూవీ చూస్తే జన్మలో వాక్యూమ్ క్లీనర్ జోలికి వెళ్లరు… క్రేజీ మర్డర్ మిస్టరీ

OTT Movie : ప్రస్తుతం ఇండియాలో మలయాళ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్… ఇలా జానర్ ఏదైనా సరే మలయాళీల టేకింగ్ సరికొత్తగా ఉంటుంది. కరోనా టైంలో ఓటీటీలు పాపులర్ అవ్వడం, అందులోనూ మలయాళ సినిమాలు ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా నచ్చేయడంతో దాదాపు ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిందే. మరి ఈ క్రేజీ మర్డర్ మిస్టరీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..


ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. సంజాద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, రంజిత్ సంజీవ్, దిలీప్ పోతన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అలాగే శ్రీకాంత్ మురళి, చిన్ను చాందిని, సిద్ధికి, సన్నీ వైన్, అన్సర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ పై అన్నీ సంజీవ్, సంజీవ్ పీకే ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ లో అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాను డైరెక్టర్ సంజాద్ ఊహకందని ట్విస్టులతో, గ్రిప్పింగ్ నేరేషన్ తో అద్భుతంగా రూపొందించారు. ఇక ఈ మూవీని చూశాక ఆఫీస్ లో వాడే బయోమెట్రిక్స్ లేదంటే వ్యాక్యూమ్ క్లీనర్లు చూశారంటే కచ్చితంగా జడుచుకుంటారు.

థియేటర్లలో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ మూవీని ముందుగా ఆగస్టులో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రిలీజ్ చేశారు. కానీ అప్పుడు ఈ సినిమాను కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం నాలుగు సౌత్ లాంగ్వేజెస్ లో ఈ మూవీని విడుదల చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ వంటి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.


కథలోకి వెళ్తే… ఇసాక్ అనే వ్యక్తి ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. అతను ఊహించని విధంగా అనుమానాస్పదంగా శవమై కనిపించి షాక్ ఇస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే డెడ్ బాడీ ఉన్న గదికి లోపల నుంచే లాక్ వేసి ఉంటుంది. దీంతో కేసును పరిశీలించిన పోలీసులు ప్రమాదవశాత్తు అతని కింద పడి తలకు గాయమై చనిపోయాడేమోనని భావిస్తారు. ఏఎస్పి సందీప్ ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలు తీసుకుంటారు. కానీ అతనికి ఇది అసలు ప్రమాదం కాదు, హత్య అనే అనుమానం వస్తుంది. దీంతో తనదైన శైలిలో విచారణ మొదలు పెట్టగా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. నిజంగానే ఇసాక్ ను హత్య చేశారా? అతన్ని చంపింది ఎవరు? సందీప్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ‘గోలం’ (Golam) అనే ఈ  మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే చెవి కోసుకునే వారు డోంట్ మిస్.

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×