OTT Web Series: నేటి తరం యువత ఆలోచనలు, కెరీర్ గురించి తీసుకునే నిర్ణయాలు, ప్రేమ పేరుతో తీసుకునే తొందరపాటు చర్యలు వారి జీవితాలను ఎలా మలుపు తిప్పుతాయో కళ్లకు కట్టేలా రూపొందిన సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ‘టీన్ తిగడా’ (Teen Tigada). ప్రసన్న బిష్త్ (Prasanna Bisht), దనేష్ రజ్వీ (Danesh Razvi) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు రాజీవ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో గ్రూషా కపూర్, సాగర్ దేశ్‌ముఖ్, అదితి సారంగ్‌ధర్, తాన్యా భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. ఒక ప్రేమకథగా కాకుండా, నేటి యువతకు ఒక చక్కటి కనువిప్పు కలిగించే సందేశంతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిబ్బా, నిబ్బీ లైతే ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వద్దు.
ఈ సిరీస్ కథంతా ముంబై మహానగరం నేపథ్యంలో, రెండు భిన్నమైన ఆశయాలు, నేపథ్యాలు ఉన్న యువతీయువకుల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది. అస్మాని (ప్రసన్న బిష్త్) భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఆడాలని, స్మృతి మంధానలా ఎదగాలని కలలు కనే ఒక ప్రతిభావంతురాలైన క్రికెటర్. కూతురి కలను నెరవేర్చడం కోసం ఆమె తండ్రి అప్పులు చేసి మరీ ముంబైలో శిక్షణ ఇప్పిస్తుంటాడు. మరోవైపు మానస్ (దనేష్ రజ్వీ) తన సోదరుడిని కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ, తన మ్యూజిక్ బ్యాండ్‌తో రాక్‌స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపించే యువకుడు. అనుకోకుండా ఒక పబ్‌లో కలిసిన వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా, ఆపై గాఢమైన ప్రేమగా మారుతుంది.
అంతా సాఫీగా సాగిపోతూ, తమ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న తరుణంలో ఒక ఊహించని రాత్రి వీరి జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేస్తుంది. పెళ్లికి ముందే అస్మాని ప్రెగ్నెంట్ కావడం ఈ యువ జంటకు పెద్ద షాక్ ఇస్తుంది. ఒకవైపు తండ్రి పెట్టుకున్న నమ్మకం, కళ్లముందున్న నేషనల్ క్రికెట్ సెలెక్షన్స్.. మరోవైపు సంగీత రంగంలో నిలదొక్కుకోవాలనే మానస్ ఆరాటం.. ఇంకోవైపు అనుకోకుండా వచ్చిపడిన తల్లిదండ్రుల బాధ్యత. ఈ పరిస్థితుల మధ్య ఆ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంది? వీళ్ళు తమ ప్రేమను, కెరీర్ ను గెలిచి చూపించారా ? అనే అంశాలతో ఈ స్టోరీ క్లైమాక్స్ వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 నవంబర్ 20 నుంచి ఈ సిరీస్‌కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు ఒకేసారి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ సదుపాయం కూడా ఉంది. యూత్‌ఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వారికి వీకెండ్‌లో చూసేందుకు ఇదొక మంచి ఆప్షన్.
Read Also : ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ