E-Paper
Advertisement

గంభీర్ పై బాసిత్ అలీ సెటైర్లు…నేపాల్ పై అద‌ర‌గొట్టిన హ‌ర్షిత్ రాణాకు న్యూజిలాండ్ వీసా రెడీ చేయాలంటూ!

గంభీర్ పై బాసిత్ అలీ సెటైర్లు…నేపాల్ పై అద‌ర‌గొట్టిన హ‌ర్షిత్ రాణాకు న్యూజిలాండ్ వీసా రెడీ చేయాలంటూ!
Advertisement

Basit Ali On Harshit Rana:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) గ్రూప్ స్టేజ్ లో టీమిండియా – ఏ జ‌ట్టు శుభారంభం చేసింది. దోహా వేదికగా నిన్న టీమిండియా వర్సెస్ నేపాల్ (India A vs Nepal, 4th Match, Group B) జూనియర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 306 పరుగులతో విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చాలా రోజుల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా 4 వికెట్లతో చెలరేగాడు. దీంతో అతని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా (Harshit Rana) ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

నేపాల్ పై అద‌ర‌గొట్టిన హ‌ర్షిత్ రాణాకు న్యూజిలాండ్ వీసా రెడీ చేయాలంటూ!

నేపాల్ జూనియర్ జట్టు పై నాలుగు వికెట్లు పడగొట్టిన హర్షిత్ రాణాను ( Harshit Rana) మెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ ఆలీ (Basit Ali )… సెటైరికల్ కామెంట్స్ చేశాడు. హర్షిత్ రాణాను వెంటనే న్యూజిలాండ్ సిరీస్ కు గంభీర్ తీసుకువెళ్లాలని ఎద్దేవా చేశాడు. నాలుగు వికెట్లు తీసిన విషయం తెలిసిన వెంట‌నే అత‌ని కోసం ఫ్లైట్ టికెట్లు గంభీర్ బుక్ చేస్తాడ‌ని పేర్కొన్నాడు. హ‌ర్షిత్ రాణా…గంభీర్ పెద్ద కొడుకు అంటూ ఆడుకున్నాడు. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లేక‌పోయినా హ‌ర్షిత్ రాణాకు ప్లేస్ మాత్రం గ్యారెంటీ అన్నాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

టీమిండియా ప్రదర్శన పై కమ్రాన్ అక్మల్ ప్రశంసలు

హర్షిత్ రాణాపై బాసిత్ అలీ సెటైరికల్ కామెంట్స్ చేయగా… టీమిండియా జూనియర్ జట్టుపై కమ్రాన్ అక్మ‌ల్ ప్రశంసలు కురిపించాడు. పసికూన‌ నేపాల్ పై టీమిండియా కుర్రాళ్ళు అదరగొట్టారని వ్యాఖ్యానించాడు. తిలక్ వర్మ, కుమార్ కుషాగ్ర సెంచరీలు కూడా అద్భుతం అన్నాడు. బౌలింగ్ లో ప్రిన్స్‌ యాదవ్, హర్షిత్ రాణా ఇరగదీసారని మెచ్చుకున్నాడు. టీమిండియా సీనియర్ల జట్టుతో పాటు దేశవాళీ క్రికెటర్లు బాగా ఆడతారని.. అందుకే ఇలా దూసుకు వెళ్తున్నారని పేర్కొన్నాడు. ఇది ఇలా ఉండగా శుక్రవారం జరిగిన నేపాల్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ లో తిలక్ వర్మ సేన సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జూనియర్ జట్టు 50 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు సాధించింది. ఈ క్రమంలో చేజింగ్ కు దిగిన నేపాల్ జట్టు 11.3 ఓవర్లు ఆడి 26 పరుగులకు కుప్పకూలింది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

 

Related News

సురేష్ రైనాను CSK వాడుకుని వ‌దిలేసింది.. అంబ‌టి రాయుడు సంచ‌ల‌నం

టీమిండియాలాగా చీటింగ్ చేయ‌లేదు.. రూల్స్ ప్రకార‌మే అంధుల ఆసియా క‌ప్ గెలిచాం

పొర‌పాటున ధోని జెర్సీపై ఆటోగ్రాఫ్…డ్రెస్సింగ్ రూంలో కూర్చొని గంభీర్ ర‌చ్చ‌

SRH ఓన‌ర్ కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!

ఇండియాను ఎగ‌తాళి చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెట‌ర్ల సెల‌బ్రేష‌న్స్‌..హరీస్ రౌఫ్ ను మించిపోయేలా

కంటిచూపు లేకపోయినా ఫైనల్‌లో టీమిండియాను ఓడించారు.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×