Malayala Thriller Movies OTT : మలయాళం ఇండస్ట్రీలో ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. గత ఏడాది వరుసగా వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. చిన్న కంటెంట్తో వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.. ఒక్క మాటలో చెప్పాలంటే గత ఏడాది మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. చిన్న కంటెంట్ తో వచ్చిన సినిమాలు సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ మీ అందుకోడంతో పాటుగా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తున్నాయి. ఇక అంతే కాదు ఓటిటి సంస్థలు కూడా మలయాళ సినిమాలని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈసారి ఒకేసారి మూడు మలయాళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలోకి రాబోతున్న ఆ మూడు థ్రిల్లర్ మూవీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్..
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్.. జనవరి 23వ తేదీన థియేటర్లలో రిలీజైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ చిత్రం మోస్తరు హిట్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.. ఈ నెలలోనే స్ట్రీమింగ్ కు రాబోతుంది. మరి మూవీ మార్చి లోనే స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఎప్పుడు రాబోతుందో తెలియదు..
ఆఫీసర్..
ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‍తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. కుంచకో బోబన్, ప్రియమణి, జగదీశ్ లు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన నెలలోపే ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది. మార్చి 7 న మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
రేఖా చిత్రం..
మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో రేఖా చిత్రం కూడా ఒకటి.. జనవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఆసిఫ్ అలీ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. జొఫిన్ చాకో సినిమాను డైరెక్ట్ చేశాడు. మర్డర్ మిస్టరీగా వచ్చిన మూవీ ఇది.. కొత్త కంటెంట్ కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈ మూవీని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పుడు సోనిలీవ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.. మార్చి 7న సోనీ లివ్ ఓటీటీలోకి రానున్న ఈ రేఖాచిత్రం మూవీకిి వ్యూస్ భారీగానే దక్కుతాయనే అంచనాలు ఉన్నాయి.. ఈ మూడు సినిమాలు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.. థియేటర్లలో మంచి టాక్ ని అందుకున్న ఈ సినిమాలు ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..