OTT Movie : క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టినప్పుడు, రిలాక్స్ అవ్వాలనుకునే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం ఫ్యామిలీ డ్రామా సినిమాను చూస్తే కాస్తయినా రిలాక్స్ అవుతారు. ఇందులో ఫస్ట్ నైట్ ధైర్యంగా చేసుకోవడానికి హీరోకి మందు తాగమని ఫ్రెండ్స్ సలహా ఇస్తారు. ఆ తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘మందాకిని’ (Mandakini). 2024 లో వచ్చిన ఈ ‘మందాకిని’ మూవీకి వినోద్ లీలా దర్శకత్వం వహించారు. స్పైర్ ప్రొడక్షన్స్ పై సంజు ఉన్నితాన్ దీనిని నిర్మించారు. ఇందులో అల్తాఫ్ సలీం, అనార్కలి మరికర్, గణపతి ఎస్. పొదువాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 24 మే 2024న విడుదలైంది. కొత్తగా పెళ్ళయిన జంట చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), మనోరమ మ్యాక్స్ (Manorama Max) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
అరుమల్ గుడికి వచ్చి దేవున్ని ప్రార్థిస్తూ ఉంటాడు. తనకు ఇంత అందమైన అమ్మాయిని భార్యగా ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇదివరకే అతన్ని ముగ్గురు అమ్మాయిలు రిజెక్ట్ చేసి ఉంటారు. నిజానికి అరుమల్ అందంగా లేకపోయినా, మంచి మనసుతో ఓ మాదిరిగా ఉంటాడు. పెళ్లికూతురు మందాకిని మాత్రం చాలా అందంగా ఉంటుంది. అదే రోజు వీళ్ళిద్దరూ ఫస్ట్ నైట్ కి రెడీ అవుతూ ఉంటారు. అరుమల్ కాస్త చిన్నపిల్లాడి మనస్తత్వం కావడంతో, ఫస్ట్ నైట్ మంచిగా జరగడానికి కాస్త మందు తాగమని ఫ్రెండ్స్ సలహా ఇస్తారు. అయితే ఆ మందు గ్లాసు మారిపోతుంది. అరుమల్ కి మందు రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంతవరకు ఆల్కహాల్ తీసుకోకపోవడం వలన జ్యూస్ తాగి అదే మందు అనుకుంటాడు. అయితే ఆ గ్లాస్ మందాకిని తాగుతుంది. అప్పుడు గదిలోకి వెళ్లిన అరుమల్ కి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మందాకిని నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాలని మారం చేస్తూ కూర్చుంటుంది. తాగిన మత్తులో ఆ రచ్చ పెరిగి పెద్దదవుతుంది.
అరుమల్ తల్లి మందాకిని తల్లిదండ్రులను పిలిపిస్తుంది. అయితే వాళ్లు తప్పు మీదేనని, మా అమ్మాయికి మందు ఎలా తాగిపిస్తారని గొడవ పడతారు. నిజానికి ఇదివరకే సుజిత్ అనే వ్యక్తితో మందాకినీ ప్రేమలో ఉంటుంది. ఇద్దరూ లేచిపోవాలనుకునే సమయానికి, ముందాకిని నగలు తీసుకుని పారిపోతాడు సుజిత్. మోసపోయానని గ్రహించి మందాకిని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అరుమల్ ని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రచ్చ జరుగుతూ ఉండగా, అరుమల్ తల్లి కూడా మందు తాగి సుజిత్ దగ్గరికి వెళ్లి విషయం తేల్చుకోవాలనుకుంటుంది. చివరికి మందాకిని సుజిత్ దగ్గరికి ఎందుకు వెళ్లాలనుకుంటుంది? అరుమల్ తో మొదటి రాత్రి జరుగుతుందా? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘మందాకిని’ (Mandakini) అనే ఈ మూవీని చూడండి.