BigTV English
Advertisement

Mirzapur 3: మీర్జాపూర్ 3.. మున్నాభాయ్ ఈజ్ బ్యాక్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే..?

Mirzapur 3: మీర్జాపూర్ 3.. మున్నాభాయ్ ఈజ్ బ్యాక్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే..?

Mirzapur 3 Bonus Episode with Munna Bhaiya : ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే తప్ప పెద్దగా థియేటర్లో సినిమాలు చూడటం లేదు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర ఉండి.. ఎలాంటి టికెట్ లేకుండా కేవలం చేతిలో మొబైల్ పెట్టుకునే సదుపాయం ఓటీటీల ద్వారా అందుతుంది. అందులోనూ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లైన నెట్‌ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమాస్ సహా ఇతర సంస్థ కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను ఓటీటీలో రిలీజ్ చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.


అంతేకాకుండా సొంతంగా డాక్యుమెంటరీలు కూడా రూపొందించి సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్‌లను రూపొందించి ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. క్రైమ్, థ్రిల్లింగ్, సస్పెన్స్, యాక్షన్ ఇలా డిఫరెంట్ కాన్సెప్టులతో సిరీస్‌లను తీస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. అలా గతంలో ఓ సిరీస్‌ ఓటీటీలో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకుంది.

అది మరేదో కాదు మీర్జాపూర్. ఈ సిరీస్ గతంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 2018లో ప్రముఖ ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అలా వచ్చిన సీజన్ 1 సిరీస్ సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా మీర్జాపూర్ అనగానే గుర్తొచ్చే నటుడు మున్నాభాయ్. అందరిలోనూ అతడి పేరు మున్నాభాయ్‌గా గుర్తుండిపోయింది. అలాగే ఇందులో నటించిన ఖాలిన్ భయ్యా, గుడ్డు బాయ్ పేర్లు అందరి మెదళ్లలో నిలిచిపోయింది.


Also Read: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి అంతా గుడ్డు భాయ్ దే హవా

ముఖ్యంగా బీనా ఆంటీ పేరు అయితే మరచిపోవడం కష్టమనే చెప్పాలి. తొలుత హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ అయింది. దీంతో ఈ సీజన్ 1కి సూపర్ డూపర్ రెస్పాన్స్ రావడంతో అంతా సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూశారు. ఇందులో పచ్చి బూతులు ఉన్నా కూడా ఆడియన్స్ ఈ సిరీస్‌కు నీరాజనాలు పలికారు. మొదటి సీజన్‌కు అన్షుమాన్ దర్శకత్వం వహించాడు. ఈ సీజన్‌కు మంచి గుర్తింపు రావడంతో సెకండ్ సీజన్ వచ్చింది. ఈ సెకండ్ సీజన్‌ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో ఓటీటీలో సంచలనం సృష్టించింది. అలా ఈ రెండు సీజన్లకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో అందరిలోనూ మూడో సీజన్‌పై ఆసక్తి మొదలైంది.

అయితే ఆసక్తి ఎంత పెరిగిందో.. కంగారు కూడా పెరిగింది. ఎందుకంటే సెకండ్ సీజన్‌లో మున్నాభాయ్‌ని గుడ్డుభయ్యా కాల్చి చంపేస్తాడు. దీంతో మూడో పార్ట్‌లో మున్నాభాయ్ ఉండడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఏదో ఒక ఎపిసోడ్‌లో అతడు ఎంట్రీ ఇవ్వొచ్చని అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. మూడో సీజన్‌లో మున్నాభయ్యా కనిపించకపోవడంతో ఈ వెబ్‌సిరీస్ పెద్దగా అలరించలేకపోయింది. ఆడియన్స్ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మున్నాభయ్యా ఉంటేనే బాగుంటుందని.. అతడు ఇందులో లేకపోవడంతో ఈ సీజన్ 3ని పెద్దగా ఎవరూ చూడలేదు.

దీంతో మేకర్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మీర్జాపూర్ సీజన్ 3 కి సంబంధించి ఒక బోనస్ ఎపిసోడ్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బోనస్ ఎపిసోడ్‌లో మున్నాభాయ్‌ను పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇవాళ్టి నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు మేకర్స్ ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Related News

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

Big Stories

×