BigTV English
Advertisement

Mirzapur season 3 trailer: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి అంతా గుడ్డు భాయ్ దే హవా

Mirzapur season 3 trailer: మీర్జాపూర్  3 ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి అంతా గుడ్డు భాయ్ దే హవా

Mirzapur season 3 trailer: మీర్జాపూర్.. ఈ వెబ్ సిరీస్ ఒకప్పుడు చేసిన హంగామా అంత ఇంతా కాదు. 2018 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ సీజన్ 1 రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అప్పుడెప్పుడే ఓటిటీలో వెబ్ సిరీస్ లు క్లిక్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్ .. పరంపర, ప్రతిష్ట అంటూ మొదలయ్యింది. ఖాలిన్ భయ్యా, మున్నా, గుడ్డు భాయ్.. వీరందరి కన్నా బీనా ఆంటీ.. అసలు ఈ పేర్లను మర్చిపోవడం కష్టమే.


పునీత్ కృష్ణ & వినీత్ కృష్ణతో కలిసి స్క్రిప్ట్ రాసిన కరణ్ అన్షుమాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. మొదట హిందీలో రిలీజ్ అయిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ అయ్యింది. మొట్ట మొదటిసారి తెలుగువారికి రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్ ను పరిచయం చేసిన సిరీస్ అంటే ఇదే అని చెప్పాలి.

పచ్చి బూతులు ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం మీర్జాపూర్ ను చూడడం మానలేదు. సీజన్ 1 ఎంత విజయవంతం అయ్యిందో సీజన్ 2 కూడా అంతే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మొదటి సీజన్‌కు అన్షుమాన్ దర్శకత్వం వహించగా.. గుర్మీత్ సింగ్ మరియు మిహిర్ దేశాయ్‌లతో కలిసి రెండవ సీజన్‌కు దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ లో మున్నాకు ధీటుగా గుడ్డు మరియు బబ్లూ అన్నదమ్ములు ఢీకొట్టారు. చివర్లో మున్నా.. బబ్లూతో పాటు గుడ్డు భార్యను కూడా చంపేస్తాడు.


ఇక రెండవ సీజన్ లో గుడ్డు.. మున్నా మీద పగతీర్చుకోవడానికి వచ్చి ఖాలిన్ భయ్యా సామ్రాజ్యాన్ని కాల్చి మున్నాను చంపేస్తాడు. ఇక ఇప్పుడు ముచ్చుటగా మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు. జూలై 5 న ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, ఇషా తల్వార్, లిల్లీపుట్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, అనంగ్షా బిస్వాస్ మరియు నేహా సర్గమ్‌ తదితరులు నటించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మున్నా చనిపోవడంతో మీర్జాపూర్ సింహాసనానికి మకుటం లేని మహారాజు అవుతాడు గుడ్డు భాయ్.

కొడుకును చంపిన గుడ్డును చంపి.. మళ్లీ మీర్జాపూర్ ను సొంతం చేసుకోవాలని ఒకపక్క ఖాలీన్ భయ్యా.. ఇంకోపక్క లోకల్ గ్యాంగ్స్ పోటీపడుతూ ఉంటాయి. మరి ఈసారి గుడ్డు భాయ్ ఎలా తనను తాను కాపుడుకుంటూ పండిట్ వంశాన్ని కాపాడతాడు అనేది చూడాలి. ట్రైలర్ ను మొత్తం యాక్షన్ తో నింపేశారు. ఈసారి హవా మొత్తం గుడ్డు భాయ్ దే అనిపిస్తుంది. మరి ఈ సీజన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×