BigTV English
Advertisement

OTT Movie : ప్రియుడితో కలిసి భర్త మర్డర్ కు భార్య మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఊర మాస్ అంతే

OTT Movie : ప్రియుడితో కలిసి భర్త మర్డర్ కు భార్య మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఊర మాస్ అంతే

OTT Movie : సంక్రాంతి పండగ నుంచి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో హంగామా చేస్తున్నాయి. అలా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. మసూద ఫేమ్ తిరువీర్ నటించిన ఒక మలయాళం మూవీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీ పేరు ‘మోక్ష పటం‘ (Moksha Patam). రాహుల్ వనజ రాజేశ్వర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రువీర్, పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, షాంతి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయకుండా, డైరెక్ట్ గా జనవరి 14 నుంచి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మహేష్, గాయత్రి ఆరేళ్ల కొడుకుతో కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే మహేష్ తన దగ్గర ఉన్న డబ్బును, ఫ్రెండ్ చిట్ఫండ్ కంపెనీలో పెడతాడు. అతడు ఒక ప్రమాదంలో చనిపోవడంతో, గాయత్రి భర్తని కోపగించుకుంటూ ఉంటుంది. డబ్బులు తీసుకురమ్మని, మనకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్తుంది. ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లోర్ మేనేజర్ గా పనిచేస్తున్న గాయత్రి, ఈ విషయం మీద బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఒక గెస్ట్ రూమ్ ను వెకేట్ చేయడంతో దానిని క్లీన్ చేపిస్తుండగా, ఒక డబ్బు ఉన్న సూట్ కేస్ ఆమెకు కనబడుతుంది. దానిని ఎలా సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు శాన్వి అనే అమ్మాయిని, భరత్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు శాన్వి తండ్రి. బంధువుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ, భార్యను మాత్రం చిత్రహింసలు పెడుతూ ఉంటాడు భరత్. ఒకరోజు భర్త పనిమీద మూడు రోజులు బయటకు వెళ్లడంతో, శాన్వి ఫ్రెండ్ తో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ శాన్వికి ఒక బాయ్ ఫ్రెండ్ తగులుతాడు. అతనితో ఏకాంతంగా గడిపి తన బాధను చెప్పుకుంటుంది. విడాకులు ఇవ్వమని బాయ్ ఫ్రెండ్ అడగడంతో, అది కుదిరే పని కాదని మన ఇద్దర్ని చంపేస్తాడని చెప్తుంది.

అతడు మనల్ని చంపే ముందే, మనమే అతన్ని చంపేద్దామని బాయ్ ఫ్రెండ్ శాన్వికి చెప్తాడు. భర్త ప్రమాదంలో చనిపోతేనే మనకు ఈ ఆస్తి వస్తుందని చెప్పడంతో, బాయ్ ఫ్రెండ్ లారీ తో యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంటాడు. మరోవైపు వరుణ్ అనే వ్యక్తి తన యాజమానిని మోసం చేసి విదేశాలకు వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అర్జున్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పాస్పోర్ట్ రెడీ చేయాల్సిందిగా అడుగుతాడు. అర్జున్ కి 10 లక్షలు అప్పు ఉండడంతో, ఆ పని చేయాలనుకుంటాడు. ఈ మూడు స్టోరీల చుట్టూ మూవీ తిరుగుతుంది. చివరికి మహేష్ గాయత్రిల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? శాన్వి తన భర్త అడ్డు ని బాయ్ ఫ్రెండ్ ద్వారా తొలగించుకుంటుందా? వరుణ్ విదేశాలకు వెళ్ళిపోతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘మోక్ష పటం’ (Moksha Patam) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×