Tamil Family Drama: డబ్బు చుట్టూ తిరిగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమన్ ఇగోస్ ని చాలా సింపుల్ గా, అంతే ఎంటర్‌టైనింగ్ గా చూపెట్టే సినిమాలకు మన సౌత్ లో మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందినదే ఎటువంటి సౌండ్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతున్న లేటెస్ట్ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీ ‘All Pass’. అనుకోకుండా దొరికిన 5 కోట్ల డబ్బు చుట్టూ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర చెన్నైలోని సత్యా నగర్‌లో మూడు కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటాయి. రక్తసంబంధం లేకపోయినా, ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఆ మూడు కుటుంబాల్లోని పిల్లలు ఒకరోజు ఆడుకుంటూ పాత ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తారు. అక్కడ వారికి అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు దొరుకుతుంది. బ్యాగ్ తెరిచి చూడగానే అందులో ఏకంగా రూ.5 కోట్ల నగదు కనిపిస్తుంది.
అంత పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడంతో పిల్లలు దాన్ని ఇంటికి తీసుకొస్తారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యుల్లో కొందరు తమ పేదరికం తీరిపోతుందని, ఆ డబ్బును పంచుకుని జీవితాన్ని మార్చుకోవచ్చని ఆశపడతారు. కానీ అలగప్పర్ (జయప్రకాశ్) మాత్రం అందుకు అంగీకరించడు. అది తమది కాని డబ్బు కాబట్టి తిరిగి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెట్టేయాలని చెబుతాడు. అయితే మిగతా కుటుంబ సభ్యులు అతడి మాటను పట్టించుకోరు. దీంతో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే ఆ మూడు కుటుంబాల మధ్య మొదటిసారిగా విభేదాలు మొదలవుతాయి.
ఇక్కడ మరో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఆ ఐదు కోట్లు సాధారణంగా ఎవరో పోగొట్టుకున్న డబ్బు కాదు. స్థానిక ఎమ్మెల్యే దాచిపెట్టిన అక్రమ నగదు. డబ్బు కనిపించకపోవడంతో అతడు ఆగ్రహంతో ఊగిపోతాడు. తన డబ్బు ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరోవైపు ఆ డబ్బును ఖర్చు చేయాలన్నా, బయటపెట్టాలన్నా భయపడే పరిస్థితి ఆ కుటుంబాలకు ఎదురవుతుంది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్నవారి మధ్య అనుమానాలు, గొడవలు మొదలవుతాయి. మరి ఆ మూడు కుటుంబాలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాయి? తమ మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుని మళ్లీ ఒక్కటయ్యాయా? ఆ ఐదు కోట్ల డబ్బు చివరకు ఏమైంది? అనేదే మిగతా కథ.
ఈ సినిమాలో దుష్యంత్ జయప్రకాశ్ కార్తీక్ పాత్రలో, జనని కునశీలన్ ప్రియ పాత్రలో నటించారు. జయప్రకాశ్ అలగప్పర్‌గా, సెంథికుమారి, సుబ్రమణియ శివ, వినోదిని వైద్యనాథన్, ప్రసన్న బాలచంద్రన్, శరత్ లోహితాశ్వ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. మైధీన్ పక్కీర్ మైధీన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. మోహనా ఆర్. రంగానాథన్ నిర్మించిన ఈ చిత్రానికి జేమ్స్ వసంతన్ సంగీతం అందించారు. సుమారు 2 గంటల 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా నవంబర్ 6 నుంచి Amazon Prime Videoలో తమిళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లేదు.
Read Also: భర్త ఉండగానే మరొకరితో… కెమెరా ముందే బట్టబయలైన నిజాలు… క్రేజీ కొరియన్ రిలేషన్‌షిప్ డ్రామా