Haiku movie:కోర్ట్ మూవీతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి ఆపళ్ల (Sridevi Apalla) నటించిన తొలి తమిళ్ చిత్రం హైకూ(Haiku). ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమెను డైరెక్టర్ పట్టుబట్టి మరీ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందించారు. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో పాటు అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో కుర్రాళ్ల ఫేవరెట్ బ్యూటీగా కూడా మారిపోయింది. అలా ఆ సినిమాతో వచ్చిన సక్సెస్ తో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన చిత్రం హైకూ.
అక్టోబర్ 23న తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఒక మోస్తారుగా ఆడినా.. జెన్జీ యువతను బాగానే ఆకట్టుకొని, మంచి కలెక్షన్లు అందుకుంది. ఇందులో ఈమెతో పాటు ఫెమినా జార్జ్, ఏగన్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా నెల కూడా పూర్తికాకుండానే అప్పుడే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 20 నుండి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది.
హైకూ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మనోహర్ (ఏగన్) తన కాలేజ్ ఫ్రెండ్స్ తో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో అప్పుడే కంబైన్డ్ కాలేజ్ గా ఏర్పడిన ఒక ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. 2000 మంది అబ్బాయిలు ఉన్న ఆ కాలేజీలో అతను ఒక్కడే అబ్బాయి. అక్కడ వకుళా (శ్రీదేవి) అనే అమ్మాయితో మనోహర్ కు పరిచయం ఏర్పడి , అది కాస్తా ప్రేమగా మారుతుంది. కుల మతాలు, హోదా పట్టింపులు ఎక్కువైనా.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇంతలోనే కాలేజ్ పూర్తయ్యాక కోయంబత్తూర్ నుంచి చెన్నైకి ఉద్యోగం కోసం వెళ్తారుm ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న స్పర్ధలు రావడంతో వకుళా ఇంకో అబ్బాయిని వివాహం చేసుకుంటుంది.
also read: ఫస్ట్ టైమ్ నాగ్ చేత తిట్లు తిన్న నరేష్.. కన్నీళ్ల వెనుక అసలేం జరిగిందంటే?
మరోవైపు మనోహర్ కూడా ఒక మంచి సంస్థలో ఉద్యోగం తెచ్చుకొని ఆఫీస్ కొలీగ్ నివేదా (ఫెమినా జార్జ్)ను ప్రేమిస్తాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య స్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఎందుకు విడిపోయారు? ఈమె మరో పెళ్లి ఎందుకు చేసుకుంది? నివేదా, మనో కూడా ఎందుకు విడిపోయారు ? అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడికి చేరింది? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే యువతను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. మరి థియేటర్లలో మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.