OTT Movie : ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను, కుటుంబాలతో కలసి అందరూ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మంచి కంటెంట్ తో వచ్చిన ఒక తమిళ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీనాక్షి చౌదరి నటించిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘సింగపూర్ సెలూన్‘ (Singapore Saloon). 2024లో విడుదలైన ఈ తమిళ్ మూవీకి గోకుల్ దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ మూవీలో RJ బాలాజీ, మీనాక్షి చౌదరి, సత్యరాజ్, లాల్, కిషన్ దాస్, ఆన్ శీతల్, తలైవాసల్ విజయ్, జాన్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంగీతం వివేక్-మెర్విన్ అందించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ‘సింగపూర్ సెలూన్’ మూవీ 25 జనవరి 2024న విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఖదీర్, బషీర్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు వెళ్లి సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ ఫంక్షన్స్ కి చాచా అనే బార్బర్ వచ్చి, వీళ్ళకి కటింగ్ తో సహా అన్ని చేస్తుంటాడు. అలా వీళ్ళిద్దరూ చాచాతో క్లోజ్ గా ఉంటూ, కటింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న నీలా అనే అమ్మాయితో ఖదీర్ ప్రేమలో పడతాడు. అనుకోకుండా నీలా వాళ్లు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఈ విషయం ఖదీర్ కి తెలిసి బాధపడతాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటాడు ఖదీర్. తను ప్రేమించిన నీలా అనే అమ్మాయి ఆ కాలేజీలో పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఇంజనీరింగ్ పూర్తి అయినా గాని, ఒక సెలూన్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటాడు ఖదీర్. ఈ విషయం తెలిసి నీలా పేరెంట్స్ ఖదీర్ తో పెళ్ళికి ఒప్పుకోరు.
ఆ తర్వాత ఇతని లైఫ్ లోకి మరొక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు కూడా నీలాంబరి కావడంతో, తను ఖదీర్ని ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సెలూన్ కి ఏర్పాట్లు చేసిన ఖదీర్ అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. సెలూన్ నుంచి బిజినెస్ జరగకపోవడంతో, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చివరికి ఖదీర్ ఆత్మహత్య చేసుకుంటాడా? ఈ సమస్యల నుంచి ఖదీర్ బయటపడతాడా? సలూన్ బిజినెస్ తోనే ముందుకు వెళ్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సింగపూర్ సెలూన్’ (Singapore saloon) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.