Kalyan Ram: నందమూరి అభిమానులు సూపర్ కిక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, లేటెస్ట్ గా “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి” అనే సినిమాలో నటిస్తున్నాడు. లేడీ అమితాబ్ విజయశాంతి పోలిస్ పాత్రలో కళ్యాణ్ రామ్ కి మదర్ గా నటిస్తోంది. పోస్టర్స్ తో పాజిటివ్ బజ్ జనరేట్ చేసిన ఈ మూవీ టీజర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటున్న ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో విజయశాంతి గురించి, బాల బాబాయ్ గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడడం హైలైట్ అనే చెప్పాలి.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, విజయశాంతితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆమె గతంలో కర్తవ్యం వంటి చిత్రాల్లో చూపించిన శక్తివంతమైన నటనను గుర్తు చేస్తూ, ఈ సినిమాలోనూ ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసించారు. “విజయశాంతి గారితో స్క్రీన్ షేర్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆమె ఎనర్జీ, కమిట్‌మెంట్ సెట్‌లో అందరికీ స్ఫూర్తిగా నిలిచాయి, సూర్య ఐపీఎస్ షూటింగ్ కి వెళ్లినప్పుడు అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చింది. అప్పటినుంచి అమ్మ అంతే స్వీట్ గా ఉంది. అమ్మ లేకుంటే ఈ సినిమా చేసి ఉపయోగం లేదని డైరెక్టర్ కి చెప్పాను. కర్తవ్యం సినిమాలో అమ్మ క్యారెక్టర్ కి కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అతనొక్కడే లాగా ఈ మూవీ కూడా 20 ఏళ్ల పాటు గుర్తుంటుంది” అని కళ్యాణ్ రామ్ మాట్లాడాడు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్… బాబాయ్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, చిన్నప్పుడు బాలకృష్ణతో కలిసి బాల గోపాలుడు చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడ. బాబాయ్ నుంచి నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కళ్యాణ్ రామ్ తెలిపాడు. “బాల బాబాయ్ ఎప్పుడూ నాకు స్ఫూర్తి. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపై ఉంది,” అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కళ్యాణ్ రామ్ నోటి నుంచి బలాక్రిష్ణ పేరు వినిపించగానే ఆడిటోరియమ్ మొత్తం మోతమోగిపోయింది. జై బాలయ్య, జై నందమూరి అంటూ అభిమానులు స్లొగన్స్ ఎత్తుకున్నారు.
గత కొంతకాలంగా నందమూరి హీరోల మధ్యలో గ్యాప్ ఉందని, ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్-బాలకృష్ణల మధ్యలో గ్యాప్ వచ్చింది, ఒకరికి ఒకరు మాట్లాడుకోవట్లేదు అనే మాట వినిపిస్తూ ఉంది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బాగున్నారు కానీ ఈ ఇద్దరిని బాలయ్య దూరం పెట్టాడు అని టాక్. ఇందులో ఎంతవరకూ నిజముందని తెలియదు కానీ ఈమధ్య కాలంలో బాబాయ్-అబ్బాయిలు అయితే కలిసి కనిపించలేదు. ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ బాబాయ్ గురించి మాట్లాడడం అభిమానులకి కిక్ ఇచ్చే విషయం.