Most Watched WebSeries In OTT : థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా కూడా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఓటీటీలోకి కొత్త కొత్త కంటెంట్ సినిమాలు రిలీజ్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను అందుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలు మంచి టాక్ ను కూడా సొంతం చేసుకుంటుకున్నాయి. ఇక సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లకు సినిమాల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది మొత్తానికి ఎక్కువ వ్యూస్ ను సంపాదించుకున్న టాప్ 5 వెబ్ సిరీస్ లు ఏవి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పంచాయత్ సీజన్ 3 – ప్రైమ్ వీడియో
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్ గా ప్రైమ్ వీడియోలోని పంచాయత్ సీజన్ 3 నిలిచింది. ఈ కొత్త సీజన్ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు.. ఈ ఏడాది మేలో స్ట్రీమింగ్ కు తీసుకొని వచ్చారు. అలా వచ్చిందో లేదో కానీ ప్రైమ్ వీడియోలో ఇప్పటి వరకూ 2.9 కోట్ల వ్యూస్ వరకూ రావడం విశేషం. ఈ మధ్యే నాలుగో సీజన్ షూటింగ్ కూడా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావొస్తున్నాయని తెలుస్తుంది. త్వరలోనే స్ట్రీమింగ్ కు రావొచ్చునని అంచనా..
హీరామండి: ది డైమండ్ బజార్, నెట్‌ఫ్లిక్స్..
హిందీలో సరికొత్త కథలతో ఓటీటీలోకి సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలాంటి సక్సెస్ ను అందుకున్న వెబ్ సిరీస్ లలో హిరా మండి అనేది కొత్త కాన్సెఫ్ట్ తో వచ్చింది. ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది అడుగుపెట్టిన ఈ సిరీస్ ను సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేశాడు.. భారీ అంచనాలతో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇది ఒక్కటి. 2.1 వరకు వ్యూస్ వచ్చాయి..
ఇండియన్ పోలీస్ ఫోర్స్ – ప్రైమ్ వీడియో
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, ఇషా తల్వార్ వంటి బాలీవుడ్ ప్రములు ఈ మూవీలో నటించారు. ఈ వెరీస్ ఆలా రిలీజ్ అయ్యిందో లేదు.. 1.9 వ్యూస్ ను అందుకుంది.
షోటైమ్ – హాట్‌స్టార్..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ ఏడాది అడుగుపెట్టిన మరో వెబ్ సిరీస్ షోటైమ్. రంగుల లోకమైన సినిమా ఇండస్ట్రీ తెర వెనుక జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇమ్రాన్ హష్మి నటించిన ఈ వెబ్ సిరీస్ కు 1.25 కోట్ల వ్యూస్ ను అందుకుంది. ఇప్పటికి ట్రెండింగ్ లో ఉందంటే మామూలు విషయం కాదు..
మహారాణి సీజన్ 3 – సోనీలివ్..
మహారాణి ఓ పొలిటికల్ స్టోరీలైన్ తో వచ్చిన వెబ్ సిరీస్. తొలి రెండు సీజన్లు బాగా ఆకట్టుకోవడంతో మూడో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది కొత్త సీజన్ రిలీజ్ అయ్యింది. అక్కడ భారీ వ్యూస్ ను అందుకుంది. ఓటీటీలో ఈ సిరీస్ కు 1.02 కోట్ల వ్యూస్ వచ్చాయి..
ఇవేకాదు ఇంకా చాలా వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇవి ఏ ఏడాది టాప్ వ్యూస్ ను అందుకున్నాయి.