The Last Sunrise OTT : జీవితంపై పెద్దగా ఆశలు లేని ఓ 22 ఏళ్ల అమ్మాయి… సమ్మర్ వెకేషన్ కోసం స్పెయిన్‌లోని అందమైన మల్లోర్కా దీవికి వెళ్తుంది. అక్కడ పరిచయమైన జాలరి, ఆమెకు జీవితాన్ని కొత్తగా చూడటం నేర్పిస్తే ? అతనితో ప్రేమలో పడిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తే ? ఒకవైపు ప్రాణాంతక అనారోగ్యం, మరోవైపు కొత్తగా దొరికిన ప్రేమ… చివరికి ఆమె ఏ నిర్ణయం తీసుకుంది ? అదే ఫీల్‌గుడ్ రొమాంటిక్ డ్రామా ‘ది లాస్ట్ సన్‌రైజ్’ (The Last Sunrise Movie) కథ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయం తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్దాం పదండి.
22 ఏళ్ల రై చిన్నప్పటి నుంచి ఓ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధ పడుతుంది. తన కూతురికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో ఆమె తల్లి ఐసోల్డ్ కూడా రైని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడానికి కూడా పెద్దగా అవకాశం లేని రై, తల్లితో కలిసి స్పెయిన్‌లోని మల్లోర్కా దీవికి సమ్మర్ వెకేషన్‌కు వస్తుంది. అక్కడే ఆమె జీవితంలోకి జూలియన్ అనే స్థానిక యువకుడు వస్తాడు. జాలరిగా జీవించే జూలియన్‌కు జీవితంపై చాలా భిన్నమైన దృక్పథం ఉంటుంది.
భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా, చేతిలో ఉన్న ఈ క్షణాన్ని సంతోషంగా గడపాలని రైకి చెబుతుంటాడు. మొదట స్నేహంగా మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. రైకి కూడా అతనితో గడిపే ప్రతి క్షణం ప్రత్యేకంగా అనిపిస్తుంది. తన అనారోగ్యం, భవిష్యత్తుపై ఉన్న భయాలను కాసేపైనా మర్చిపోయి జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెడుతుంది. కానీ సమ్మర్ ముగిసే సమయానికి పరిస్థితులు మారిపోతాయి. రై ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. అమెరికాకు తిరిగి వెళ్లాల్సిన సమయం దగ్గర పడటంతో జూలియన్‌ను వదిలి వెళ్లాలనే ఆలోచన ఆమెను కలవర పెడుతుంది.
అదే సమయంలో కుటుంబానికి సంబంధించిన కొన్ని దాచిన నిజాలు కూడా బయట పడతాయి. దీంతో రై ముందున్న సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. ఒకవైపు తన ఆరోగ్యం, మరోవైపు తల్లి బాధ్యతలు, ఇంకోవైపు తన జీవితంలో నిజమైన ఆనందాన్ని పరిచయం చేసిన జూలియన్. ఇంతకీ రై తన కుటుంబం కోసం అమెరికాకు తిరిగి వెళ్లిందా? లేక తన మనసు చెప్పినట్టు జూలియన్‌తో కలిసి కొత్త జీవితాన్ని ఎంచుకుందా ? తన అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ ప్రేమను ఎలా నిలబెట్టుకుంది ? ఆ వేసవి ఆమె జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చింది ? అనేదే మిగిలిన కథ.
Also Read : 62 ఏళ్ల చరిత్రకు ముగింపు… కార్గిల్‌లో శత్రువులకు చుక్కలు చూపించిన ఆ విమానం కథ ఇదే
మాయా రెఫిక్కో, ఫెర్నాండో లిండెజ్, ఎవా లాంగోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది లాస్ట్ సన్ రైజ్’ను కార్ల్సన్ యంగ్ తెరకెక్కించారు. అన్నా టాడ్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్టు 26 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా సినిమా తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ఓటీటీలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, ఫీల్‌గుడ్ కథల కోసం వెతికే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్.