BigTV English

Action Movie OTT : మైండ్ బ్లాక్ చేసే సీన్ల తో యాక్షన్ మూవీ.. ఒక్క చిన్న తప్పుతో దొరికిన విలన్..

Action Movie OTT : మైండ్ బ్లాక్ చేసే సీన్ల తో యాక్షన్ మూవీ.. ఒక్క చిన్న తప్పుతో దొరికిన విలన్..

Action Movie OTT : తెలుగు సినిమాలతో పాటుగా మలయాళం సినిమాలు కూడా ఆసక్తిగా ఉంటున్నాయి. అందులో హారర్, యాక్షన్ మూవీలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్య సస్పెన్స్ సినిమాలకు కేరాఫ్ మలయాళం అనే విధంగా సరికొత్త కథలతో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పలకరించాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటిలో కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే సీన్లతో కలిగిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటిలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం..


మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ “పణి” ఓటీటీలోకి వస్తోంది. జోజూ జార్జ్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పణి మూవీ ఈ ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా భారీగా కలెక్షన్స్ ను కూడా రాబాట్టింది. ఆ సినిమాను ఓటీటిలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘సోనీ లివ్’ సొంతం చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 20న ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటి స్ట్రీమింగ్ డేట్ పై త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్ 24 న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇక పణి మూవీతోనే జోజూ జార్జ్ డైరెక్టర్‌గా మలయాళ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అభినయ హీరోయిన్‌గా నటించింది. బిగ్‌బాస్ మలయాళం సీజన్ 5 కంటెస్టెంట్స్ అయిన సాగర్ సూర్య, జునైజ్‌ విలన్ పాత్రల్లో కనిపించారు. పణి మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచెయ్యడం విశేషం.. ఈ మూవీ కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇరవై ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. గిరి అనే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. భార్య గౌరితో కలిసి సంతోషంగా అతడి జీవితం సాగిపోతుంటుంది. గిరి స్నేహితుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురవుతాడు. డాన్‌, శిజీ అనే యువకులు గిరి స్నేహితుడిని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడుతుంది. గిరిని డాన్‌, శిజీ టార్గెట్ చేస్తారు.. అతన్ని ఎందుకు హత్య చేశారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ మర్డర్ మిస్టరి చుట్టూ కథ తిరుగుతుంది.. థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటిలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాల చేస్తోన్నాడు జోజు జార్జ్‌. కమల్ హాసన్‌, మణిరత్నం థగ్‌లైఫ్‌తో పాటు సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Tags

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×