TRAI OTP : డిజిటల్ రంగంలో నెట్ బ్యాంకింగ్ తో పాటు ఆధార్ వంటి కీలకమైన డాక్యుమెంట్స్ విషయంలో సైతం ఓటీపీ సేవలు ఎంతో ముఖ్యమైనవి. ఓటీపీ మెసేజ్ రాకపోతే కొన్ని సేవలు సైతం నిలిచిపోతాయి. ఈ మధ్యకాలంలో ఓటీపీ మెసేజ్లు రావడంలో ఆలస్యం కావడంతో పలువురు వినియోగదారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటీపీ సేవలు ఆగిపోనున్నాయని ప్రచారం సైతం జోరుగా సాగుతుంది. ఈ విషయంపై స్పందించిన టెలికాం రెగ్యులేటర్ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిసెంబర్ ఒకటి నుంచి ఓటీపీ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చింది.
త్వరలోనే ఓటిపి సేవలు ఆగిపోనున్నాయని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ఓటీపీ సేవలు మరింత మెరుగవుతాయని తెలిపింది. ఇకపై ఓటీపీ మెసేజ్ డెలివరీలో ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పుకు వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుత కాలంలో చలామణి అవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని హామీ ఇచ్చింది. ఓటీపీ సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాక్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకు వస్తున్నామని ట్రాయ్ తెలిపింది.
ట్రాయ్ ఇప్పటికే ఈ విషయాలపై చురుగ్గా పనిచేస్తుంది. ఫేక్ కాల్స్ తో పాటు మెసేజ్లకు సంబంధించి ఓటీపీ సంబంధిత సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి కట్టడికి చర్యలు తీసుకుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నిబంధనలతో ఎక్కువగా వస్తున్న ఓటీపీలు, మెసేజ్లు, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఒక్కసారిగా వచ్చే సందేశాలు ఆగిపోతాయని తెలిపింది. ఎక్కడి నుంచి వస్తున్నాయా గుర్తించే కొత్త టెక్నాలజీని నవంబర్ 30 లోపు టెలికాం సంస్థల ఏర్పాటు చేసుకోవాలని సైతం స్పష్టం చేసింది. నిజానికి అక్టోబర్ 31 వరకే ముందుగా గడువు ఇచ్చినప్పటికీ తర్వాత పరిస్థితిని గమనించి నవంబర్ 30 వరకు పెంచింది. ఓటీపీ పేరుతో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ ను అడ్డుకట్ట వేసే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కువగా మెసేజ్లు, ఓటీపీలు వస్తున్నాయనే విషయం తెలిసిందే. అయితే వీటిని ట్రాక్ చేసే టెక్నాలజీ ఏర్పాటు అయితే అనుమానాస్పదంగా ఉన్న సందేశాలు ఎక్కడినుంచి వచ్చాయో గుర్తించడం తేలిక అవుతుందని ట్రాయ్ వెల్లడించింది. మోసపూరిత సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తిస్తే వాటిని కట్టడం తేలికని చెప్పుకొచ్చింది. పరిష్కారం త్వరలో దొరుకుతుందని డిసెంబర్ ఒకటి నుంచి ఓటీపీ సేవలు మరింత మెరుగతాయని చెప్పింది.
డిజిటల్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రతీ యాప్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఓటీపీ అవసరం అవుతుంది. నేరగాళ్ల కట్టడి కోసం ప్రముఖ యాప్స్ అన్ని ఓటీపీతో పనిచేస్తుంటే వాటిని సైతం అవసరంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. టెలికాం సంస్థలన్నీ మరింత కట్టుదిట్టంగా పనిచేస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపింది. మరి టాయ్స్ ఆదేశాలతో టెలికాం సంస్థలన్నీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : విద్యార్ధుల భవిష్యత్తు రోబోటిక్స్, AI, 3D ప్రింటింగ్ తోనే..!