BigTV English

Suspense Thriller Movie In OTT : సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళ మూవీ.. కథలో అన్ని ట్విస్ట్ లే…

Suspense Thriller Movie In OTT : సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళ మూవీ.. కథలో అన్ని ట్విస్ట్ లే…

Suspense Thriller Movie In OTT : మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో పాటుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఎక్కువగానే దర్శనం ఇచ్చాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో మంచి వ్యూస్ ను అందుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల్లో సస్పెన్స్ మూవీలకు కొదవలేదు. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలను కూడా తమ యుజర్స్ కు అందిస్తుంది. తాజాగా అలాంటి సస్పెన్స్ మూవీ ఒకటి ఓటీటీ సిద్ధంగా ఉంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


మలయాళం సస్పెన్స్ థిల్లర్ మూవీ కురుక్కు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. నేడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. కురుక్కు మూవీ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 99 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆమెజాన్ ప్రైమ్ తన ఖాతాలో పేర్కొన్నారు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. ఇక ఈ మూవీలో అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్‌, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జూన్‌లో ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది..

ఈ మూవీలో కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకేక్కింది. ఇందులో ఎటువంటి కామెడీ ట్రాక్‌లు, పాటలు లేకుండా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు కురుక్క మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా నిడివి కూడా గంట నలభై తొమ్మిది నిమిషాలే కావడం గమనార్హం.. ఈ తక్కువ టైం లో ప్రేక్షకులను ఆకట్టుకొనేలా స్టోరీ ఉండటంతో మూవీ కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకుంది.


ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. ఇందులో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కళ్లారా చూస్తాడు. అయితే అతను పీకలు దాకా తాగి ఉండటంతో సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. జార్జ్ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. పోలీస్‌లు మాత్రం జార్జ్ నిరపరాధి అని నమ్ముతారు. కానీ సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేసారో అనేది స్టోరీ.. మర్డర్ మిస్టరీగా సాగిన ఈ క్రైమ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఈ సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యండి..

Related News

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

Big Stories

×