BigTV English

OTT Movie : అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలు… రౌడీని కాపాడినందుకు దిమ్మ తిరిగే లైఫ్ చేంజింగ్ ట్విస్ట్

OTT Movie : అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలు… రౌడీని కాపాడినందుకు దిమ్మ తిరిగే లైఫ్ చేంజింగ్ ట్విస్ట్

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మధ్య మలయాళం నుంచి వస్తున్న ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరేమిటో, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో…

ఈ మూవీ పేరు ‘మోర’ (Mura). ఈ ఏడాది వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు యువకులు ఒక పెద్ద రౌడీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీరి జీవితం ఏమవుతుంది? అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఆనంద్ అనే కుర్ర బ్యాచ్ పట్టణంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. వీళ్లు చిన్నచిన్న గొడవలు కూడా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని ఒక వ్యక్తి మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదని అనిల్ అనే రౌడీ దగ్గరికి తీసుకు వెళ్తారు. మొదట ఆనంద్ బ్యాచ్ మమ్మల్ని ఆయన తన గ్యాంగ్ లో చేర్చుకుంటారో లేదో అని డౌట్ పడతారు. అయితే ఒకరోజు రమ్య అనే పొలిటికల్ లీడర్ అనిల్ కి ఒక పని అప్పజెప్తుంది. క్వారీలో కొంత మంది స్ట్రైక్ చేస్తూ ఉంటారు. చర్చలు జరిపి, వాళ్లను ఆ స్ట్రైక్ నుంచి వెళ్లగొట్టమని చెప్తుంది. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరి జనం వచ్చి అనిల్ ని బెదిరిస్తారు. ఆ సమయంలో ఆనంద్ బ్యాచ్ వచ్చి వాళ్ళందరిని తరిమి కొడతారు.

ఇది కళ్ళారా చూసిన అనిల్ వాళ్లను తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవడంతో రమ్య మరొక పని అప్పజెప్తుంది. ఒక పెద్ద ఫ్యాక్టరీలో చాలా డబ్బు ఉందని, దానిని తీసుకురమ్మని అనిల్ కి చెప్తుంది. అనిల్ ఈ ఆనంద్ బ్యాచ్ ని ఆ పని చేయడానికి పంపిస్తాడు. వాళ్లు సక్సెస్ ఫుల్ గా ఆ డబ్బును కొట్టేస్తారు. ఆ డబ్బులు వాడుకోకుండా అనిల్ కి అప్పజెప్తారు. అయితే అందులో కొంచెం వాటా కావాలని అడుగుతారు. ఈ విషయానికి కంగు తిన్న అనిల్ రమ్య మేడం ఎంత ఇస్తే అంత తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ఆనంద్ బ్యాచ్ రమ్య దగ్గరికి వెళ్తారు. వాటా అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్లు వీళ్లను అవమానిస్తారు. చివరికి అనిల్ కి ఆనంద్ బ్యాచ్ కి మధ్య గొడవలు జరుగుతాయా? రమ్య ఈ గొడవల్లో చిక్కుకుంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×