Shrithej Health Condition : డిసెంబర్ 4 న సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా మారింది. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.. మొన్నటివరకు అతను కోలుకుంటున్నాడని చెప్పిన వైద్యులు ఇపుడు అతని ఆరోగ్యం పూర్తిగా మారిపోయిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అతని ఆరోగ్యం పై వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. వాతావరణంలో మార్పుల వల్ల శ్రీతేజ్ ఆరోగ్యం క్షీనిస్తుందని వైద్యులు చెబుతున్నారు.. ప్రస్తుతం ఇంకా వెంటిలెటర్ మీదనే ఉన్నట్లు తెలుస్తుంది. అసలు శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
మొన్నటివరకు లిక్విడ్ పుడ్స్ ను తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి శ్రీతేజ్‌కి మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతోందని వైద్యులు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైందని చెప్పారు. PCR నివేదిక ప్రకారం, అతని యాంటీబయాటిక్స్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అతని నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని వైద్యులు తెలిపారు.. అతని ఆరోగ్యమ్ పర్వాలేదని అనుకొనే లోపు ఇలా జరగడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు.
ఇప్పుడు పైప్ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామన్నారు. ఎడమ వైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్లో తెలిపారు.. బాలుడి పరిస్థితి కొద్దిగా విషమంగా ఉందని నిన్న విడుదల చేసిన బులి టెన్ లో విడుదల చేశారు. అతనికి ఏం కాకూడదు అని కోరుకుంటున్నారు. ఇక రేవతి ఫ్యామిలీకి పుష్ప 2 టీమ్ మొత్తం 2 కోట్ల ఆర్థి సాయం అందించింది. ఇటీవలే స్టార్ ప్రొడ్యసర్ దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కలిసి ఈ ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే శ్రీతేజ్ చికిత్స కు సంబంధించి అన్ని రకాల ఖర్చులు చూసుకుంటోంది.. అల్లు అర్జున్ కు ఈ కేసు పై బెయిల్ వచ్చిన ఇంకా వదల్లేదు. రోజుకో మలుపు తిరుగుతుంది.. చూడాలి ఇక ఎక్కడివరకు వెళ్తుందో..
అల్లు అర్జున్ చేసిన తప్పు వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని ఆయన కు వ్యతిరేఖత పెరుగుతుంది. ఈ కేసును జనవరి 10 కి వాయిదా వేశారు. ఇక పుష్ప 2 విషయవానికోస్తే మూవీ కలెక్షన్స్ తగ్గలేదు. దాదాపు 1800 కోట్లు అందుకుంది. జనవరి తొమ్మిది వరకు థియేటర్లలో రన్ అవుతుంది. మరి ఏ మాత్రం కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.. బాలీవుడ్ లో వరుసగా రికార్డు లను బ్రేక్ చేస్తుండు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక్కడ బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ మూవీ అక్కడ ఎలాంటి రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.