OTT Movie : హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో భయపడతాయి. ఇటువంటి కొన్ని సినిమాలు చూడాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ట్విస్టులతో వణుకు పుట్టించే ఒక హర్రర్ మిస్టరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఒడ్డిటీ’ (Oddity). ఈ మూవీలో ఒక డాక్టర్ ఇంట్లో జరిగే హత్యతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ట్విస్టులతో భయపెడుతూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డానీ, టెడ్ భార్యాభర్తలు గా ఉంటూ, ఊరి చివరన ఒక ఇంట్లో నివాసం ఉంటారు. డానీ సైకాలజిస్ట్ కావడంతో హాస్పిటల్ కి వెళ్తాడు. టెడ్ మాత్రం హౌస్ వైఫ్ కావడంతో ఇంట్లోనే ఉంటుంది. అయితే టెడ్ ఇంటి దగ్గరికి భూల్ అనే వ్యక్తి వచ్చి డోర్ కొడతాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె డోర్ తీయదు. అందుకు అతను మీ ఇంట్లో ఒక వ్యక్తి దూరాడు. దాని వల్ల మీకు ప్రమాదం ఉండవచ్చు. అందుకే డోర్ తీయమని అడుగుతాడు. అతని మాటలు నమ్మలేక టెడ్ డోర్ తీయదు. ఆ తర్వాత ఈమె చనిపోయి ఉంటుంది. దీనికి కారణం భూల్ అని అంటాడు డానీ. అతడి మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని భావిస్తాడు. మళ్లీ అతనిని హాస్పిటల్ లో జాయిన్ చేసుకుంటాడు. ఆ తర్వాత భూల్ దగ్గరికి టెడ్ సిస్టర్ డాన్సీ వస్తుంది. ఈమెకు కళ్ళు కనపడవు, కానీ కొన్ని పవర్స్ ఉంటాయి. ఎవరి కన్ను అయినా చేతితో తాకి, వాళ్లు గతంలో ఏమి చేశారు తెలుసుకుంటుంది. కానీ అంతలోనే భూల్ ని ఒక ముసుగు మనిషి చంపేస్తాడు. భూల్ కన్ను కావాలని అడుగుతుంది డాన్సీ. డాక్టర్ ఆమెకు ఆ కన్ను ఇస్తాడు. ఆ కన్ను ద్వారా తన అక్కని ఎవరు చంపారు తెలుసుకుంటుంది డాన్సీ.
తన అక్క చనిపోయిన తర్వాత కొంతకాలానికి డాక్టర్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం డాన్సీని బాధ పెడుతుంది. అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయి తో సంబంధం ఉండడం వల్లే డబ్బులు ఇచ్చి, ముసుగు మనిషితో డాక్టర్ చంపించి ఉంటాడు. ఈ విషయం భూల్ కన్ను ద్వారా తెలుసుకుంటుంది డాన్సి. చివరికి ఆ ముసుగు మనిషి ఎవరు? కళ్ళు లేని ఈమె వీరిపై ఎలా పగ తీర్చుకుంటుంది? ఈమెకు దయ్యాలు హెల్ప్ చేస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.