BigTV English

OTT Movie : గన్స్ లేవు, వయొలెన్స్ లేదు… కానీ క్షణక్షణం ఉత్కంఠభరితం ఈ థ్రిల్లర్ మూవీ

OTT Movie : గన్స్ లేవు, వయొలెన్స్ లేదు… కానీ క్షణక్షణం ఉత్కంఠభరితం ఈ థ్రిల్లర్ మూవీ

OTT Movie : ఇప్పుడు మూవీ లవర్స్ వెబ్ సిరీస్ లకు బాగా అలవాటు పడిపోయారు. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెన్సార్ నిబంధనలు వీటికి అంతగా లేకపోవటంతో, కంటెంట్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో క్రైమ్ థ్రిల్లర్ కి కామెడీని జోడించి వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ  క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘మర్డర్ మైండ్‌ఫుల్లీ’ (Murder Mindfully). 2024 లో వచ్చిన ఈ కామెడీ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ కు ఓలివర్ బేరబెన్ . దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో మొదటి సీజన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ధారావాహిక కార్స్టెన్ డస్సే రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఒక లాయర్ క్రిమినల్స్ తో ఎదుర్కొనే సమస్యలతో స్టోరీ తిరుగుతుంది.హీరో చేసే కామిడీతో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కడుపుబ్బా నవ్విస్తుంది. డిసెంబర్ 2024 నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్  (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక లాయర్ గా తన వృత్తిని నిర్వహిస్తుంటాడు. ఇతన్ని అన్నివిధాలా పరీక్షించిన ఒక గ్యాంగ్ స్టర్, హీరోతో ఒక ముఖ్యమైన డీల్ ను రెఢీ  చేసుకుంటాడు. తన దగ్గర పనిచేసే క్రిమినల్స్ కి శిక్ష పడకుండా చేయాలని అతనికి చెప్తాడు. అందుకు హీరో కూడా ఒప్పుకోవడంతో, డబ్బులు కూడా బాగానే ముడతాయి. ఆ తర్వాత హీరో కూడా ఆ గ్యాంగ్ స్టర్ కి బాగా హెల్ప్ చేస్తాడు. అతని దగ్గర పనిచేసే నెరస్తుల్ని కాపాడుతుంటాడు. అయితే ది మొదట్లో బాగానే ఉన్నా, రాను రాను అతనికి ఇది ఒక హింసలా మారుతుంది. ఆ గ్యాంగ్ స్టర్ ప్రవర్తన హీరోకి నచ్చకపోవడంతో ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఆ గ్యాంగ్ స్టర్ కి ఓపిక తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక సైకాలజిస్ట్ ను కూడా సంప్రదిస్తాడు హీరో. దానికి ఒక సైకాలజిస్ట్ దగ్గర ఒక థెరపీని కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు అతన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో హీరో కొన్ని హత్యలు కూడా చేయాల్సి వస్తుంది. చివరికి హీరో ఆ గ్యాంగ్ స్టర్ నుంచి బయటపడతాడా? సైకాలజిస్ట్ థెరపీ హీరోకి ఉపయోగపడుతుందా? హీరో హత్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మర్డర్ మైండ్‌ఫుల్లీ’ (Murder Mindfully) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూడండి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×