BigTV English

Bank Employees Strike: సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు.. నాలుగు రోజులు సేవలకు అంతరాయం

Bank Employees Strike: సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు.. నాలుగు రోజులు సేవలకు అంతరాయం

Bank Employees Strike: ఎట్టకేలకు తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. వచ్చేవారం ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు రెండు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. బ్యాంక్ యూనియన్ డిమాండ్లను ఐబీఏ అంగీకరించలేదు. దీంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


సమ్మెబాటలో బ్యాంకు ఉద్యోగులు

కీలక విషయాలపై యూనియన్ ఆఫ్ బ్యాంక్స్-ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి. వాటి మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయాన్ని బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కో–ఆపరేటివ్‌ బ్యాంకులు, రీజినల్‌ రూరల్‌ బ్యాంకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు.


దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. సమ్మె సందర్భంగా రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో బ్యాంకు సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. దీనికితోడు నాలుగో శనివారం, ఆదివారం వరుసగా రావడంతో మొత్తం మీద నాలుగు రోజుల పాటు బ్యాంక్ సర్వీసులపై ప్రభావం చూపనుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులు, అధికారుల పోస్టులను భర్తీ చేయాలని బ్యాంకు యూనియన్ల ప్రధాన డిమాండ్. దశాబ్ద కాలానికి పైగా నియామకాలు సరిగా జరగలేదు. ఫలితంగా సిబ్బంది కొరత వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వినియోగదారులకు సరిగా సేవలు అందించలేక పోతున్నామని యూనియన్లు చెబుతున్నాయి.

ALSO READ: తక్కువ పనితో నెలకు రూ. రెండు లక్షలకు పైగా సంపాదన

ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోలేదు. అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని ఆయా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 2013లో దాదాపు నాలుగు లక్షల మంది క్లర్కులు ఉండేవారు. దశాబ్దం తర్వాత ఆ సంఖ్య 2024 నాటికి రెండున్నర లక్షలకు పడిపోయింది. ఏకంగా 1,51,836 మంది తగ్గిపోయారని లెక్కలు చెబుతున్నాయి.

మొత్తం సిబ్బంది విషయానికొస్తే 2013లో దాదాపు 9 లక్షల మంది ఉండేవారు. 2024 నాటికి ఏడున్నర లక్షలకు చేరిందని యూనియన్లు పేర్కొన్నాయి. దీనికితోడు పని తీరు సమీక్షలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. ఉద్యోగ భద్రతకు ముప్పుగా భావిస్తున్నాయి యూనియన్లు.

ప్రధాన డిమాండ్ల ఏంటి?

బ్యాంకు ఉద్యోగులు ఫస్ట్ డిమాండ్ వారానికి 5 రోజుల పని దినాలు కోరుకుంటున్నారు. ఏడాది కిందట బ్యాంకు యాజమాన్యాలు ఈ డిమాండ్‌ను అంగీకరించాయి. ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ ఫైల్ సంబంధించి శాఖ నుంచి ముందుకు కదలడం లేదు. ఎందుకంటే వారానికి రెండు రోజులు సెలవు ఇస్తే సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ అంచనా.

దీంతో ఆ ఫైల్ సంబంధింత శాఖ దగ్గర ఉండిపోయింది. దీన్ని అమలు చేయాలని కోరుతున్నారు. పనితీరుకు సమీక్ష విషయంలో ప్రభుత్వ ఆదేశాలను, పని తీరు ఆధారిత ప్రోత్సాహకాల్లో మార్పులను తక్షణమే ఉపసంహరించాలన్నది మరో డిమాండ్. ఈ మధ్యకాలంలో బ్యాంకు అధికారులపై దాడులను అరికట్టేలా తగిన రక్షణ కల్పించాలన్నది మరొకటి.

గ్రాట్యుటీ పరిమితిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగా రూ.25 లక్షలకు పెంచడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించాలని కోరుతున్నారు. తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్‌ చేయాలన్నది మరొక డిమాండ్. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం, ప్రైవేటు బ్యాంకులు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా సిబ్బంది నియమించుకున్నారు. ఈ పద్దతి నిలిపివేయాలని కోరుతున్నారు.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×