OTT Movie : ప్రేమ కథలు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ కథల్లో ఎక్కువగా అబ్బాయిలు ట్రాజీడీ లైఫ్ ని గడుపుతుంటారు. దేవదాసులా మారి గడ్డాలు పెంచుకుని, చేతిలో బాటిల్, పక్కన కుక్కను పెట్టుకుని ఉంటారు. ఇలాంటి కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా అదరిస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి కిక్ ఎక్కించే ప్రమ కథ ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి, ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ బి’ (Sapta Sagaradaache Ello – Side B) 2023లో వచ్చిన కన్నడ రొమాన్టిక్ డ్రామా సినిమా. హేమంత్ ఎమ్. రావు దీనికి దర్శకత్వం వహించారు. రక్షిత్ షెట్టి, రుక్మిణి వాసంత్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 నవంబర్ 17న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలో థియేటర్లలో వచ్చింది. ఇది సైడ్ ఏ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. ఇది IMDbలో 8.0/10 రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా పార్ట్ వన్ లో మాను జైలుకు వెళతాడు. మాను, ప్రియ ల లవ్ స్టోరీ విషాదకరమైన టర్న్ తీసుకుంటుంది. మాను ప్రేమ కోసం జైలుకు కూడా వెళతాడు. ఇక పార్ట్ 2 లో మాను కొత్త జీవితంలో అడుగు పెడతాడు. పాత గాయాలను మరచిపోవాలనుకుంటాడు. అయితే ప్రియని మరచిపోలేకపోతాడు. దీన్నుంచి బయట పడటానికి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అయినా కూడా పదే పదే ప్రియ గుర్తుకు వస్తుంటుంది. మాను మళ్లీ ప్రియను కలవాలనుకుంటాడు. ఆమె ప్రేమను పొందాలనుకుంటాడు.
Read Also : నవ వధువుతో తెల్లార్లూ అదే పని… ఇదెక్కడి దిక్కుమాలిన దుష్టశక్తి… ఈ దెయ్యం అరాచకాన్ని తట్టుకోవడం కష్టం సామీ
ప్రియ కోసం అతను తన జీవితాన్ని ఎంతగా నాశనం చేసుకున్నాడో కూడా గ్రహిస్తాడు. కానీ ప్రియను ఇప్పుడు కలవడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయినా కూడా ఆమెను పొందటానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ కథ మళ్ళీ ఎమోషనల్ గా ముగుస్తుంది. మాను, ప్రియను కలుస్తాడా ? ఈ లవ్ స్టోరీ ఏమౌతుంది ? అనే విషయాలను, ఈ కన్నడ రొమాన్టిక్ సినిమాను చూసి తెలుసుకోండి.