OTT Movie : దెయ్యాల సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో, అంతే భయాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఒక దెయ్యం ఎంట్రీ తో వచ్చే సీన్స్ ను ఎంతలా భయపెట్టే విధంగా తీస్తే, ఆ సినిమాకి అంత క్రేజ్ కూడా ఉంటుంది. ఈ కథలు ఎక్కువగా పాడు బడిన బంగ్లాలో జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సినిమా, కేరళలో ఒక పాత బంగ్లా చుట్టూ తిరుగుతుంది. ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్ళే టీమ్ కి అక్కడ భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఇందులో హారర్ సీన్స్ పిచ్చెక్కించేలా ఉంటాయి. ఈ కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘హోలోకాస్ట్’ 2025లో వచ్చిన తమిళ హారర్ సినిమా. విష్ణు చంద్రన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో చార్మిలా, జయకృష్ణన్, ప్రీతి గినో, నాజ్రీన్ నజీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూన్ 13న థియేటర్లలో వచ్చింది. ప్రస్తుతం IMDbలో 5.1/10 రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
జెని అనే అమ్మాయి ఒక టాలెంట్ ఉన్న అమ్మాయి. సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. ఆమె ఒక కొత్త హారర్ సినిమాను తీయాలనుకుంటుంది. దీనికోసం ఒక భయంకర లొకేషన్ కోసం ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు తగ్గట్టు ఒక పాత బంగ్లాను చూస్తుంది. ఆ ఇల్లు చూడగానే ఆమెకు భయంకరంగా కనిపిస్తుంది. ఇక వెంటనే జెని తన టీమ్‌తో షూటింగ్ స్టార్ట్ చేస్తుంది. షూటింగ్ మధ్యలో ఆమె తన స్క్రిప్ట్‌లో రాసినట్టే ఒక పాత బాక్స్ ఇంట్లో కనిపిస్తుంది. ఆ బాక్స్ తెరిచిన తర్వాత, అక్కడ భయంకరమైన సనఘటనలు జరుగుతాయి. దీంతో ఆ బంగ్లాలో ఉన్న జెని టీమ్‌లో అందరూ భయపడతారు. జెనికి ఆ ఇంట్లో ఏదో రహస్యం ఉందని అర్థమవుతుంది.
Read Also : ఓటీటీలోకి వచ్చిన 4000 కోట్ల మూవీ… గత్తరలేపే సీన్స్… రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే మూవీ