OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్వెస్టిగేషన్ స్టోరీలు హల్చల్ చేస్తున్నాయి. మర్డర్ కేసులను సాల్వ్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఉత్కంఠతను పెంచుతున్నాయి. ఈ కథలు చూడటానికి ఆడియన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రధానంగా ట్విస్ట్లు, సస్పెన్స్ తో నడిచే ఈ కథలను కొత్త తరహాలో చూపించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఒక మలయాళం థ్రిల్లర్ సినిమా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. ఇక్కడ జర్నలిస్టులు ఒక అమ్మాయి మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చివరి వరకు హంతకుణ్ణి పట్టుకునేందుకు పోరాడతారు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘కల్లం’ 2024లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ సినిమా. అనురామ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జియో బేబీ, కైలాష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏ సినిమా 2024 డిసెంబర్ 13న థియేటర్లలో వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ కేరళలో ఒక అమ్మాయి మర్డర్ కేస్ చుట్టూ తిరుగుతుంది. కేరళలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లోనే చనిపోయి ఉంటుంది. పోలీసులు ఇది హత్యాగా అనుమానిస్తారు. ముందుగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను నిందితుడుగా చేసరుస్తారు. కానీ ఈ టీనేజ్ అమ్మాయి హత్య ఎందుకు జరిగిందో కనిపెట్టలేకపోతారు. జియో, కైలాష్ అనే ఇద్దరు జర్నలిస్టులు ఈ కేస్ వెనుక అసలు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్లు అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి కొన్ని వివరాలను తెలుసుకుంటారు.