Mystery Thriller Movie In OTT : మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల సునామి సృష్టించింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఎక్కువగానే దర్శనం ఇచ్చాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో మంచి వ్యూస్ ను అందుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల్లో సస్పెన్స్ మూవీలకు కొదవలేదు. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఓటీటీ సంస్థలు తమ యూజర్స్ కు సరికొత్త కంటెంట్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తుంది. తాజాగా అలాంటి సస్పెన్స్ మూవీ ఒకటి ఓటీటీ వచ్చేస్తుంది. ఆ మూవీ ఏంటి ? ఎక్కడ చూడొచ్చు అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం..
మలయాళం మిస్టరీ థిల్లర్ మూవీ సూక్ష్మదర్శిని అనే మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం పదికోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు పెట్టుబడికి ఐదు రేట్లు ఎక్కువగా రాబట్టింది. అంటే 55 కోట్లు వసూల్ చేసింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకేక్కింది. ఇందులో ఎటువంటి కామెడీ ట్రాక్‌లు, పాటలు లేకుండా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు మూవీని తెరకెక్కించాడు. ప్రేక్షకులను ఆకట్టుకొనేలా స్టోరీ ఉండటంతో మూవీ కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకుంది..
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. సూక్ష్మదర్శిని ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. మూవీతో దాదాపు నాలుగేళ్ల తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది నజ్రియా.. శాటిలైట్ రైట్స్‌ను కూడా జీ నెట్‌వర్క్ దక్కించుకున్నది. జనవరి రెండు, లేదా మూడో వారంలో సూక్ష్మదర్శిని మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్.. ఒక్క మలయాళంలోనే కాదు.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. స్టోరీ విషయానికొస్తే.. పక్కంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి కల ఒక మహిళ ఉంటుంది. మాన్యుయేల్ వింత ప్రవర్తన ప్రియలో అనుమానాల్ని రేకెత్తిస్తుంది. మాన్యుయేల్ తల్లి కనిపించకుండా పోతుంది. మాన్యుయేల్ లైఫ్ గురించి ఇన్వేస్టిగేట్ చేయడం మొదలుపెడుతుంది ప్రియ. ఆ అన్వేషణలో మాన్యుయేల్ గురించి ప్రియకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి అన్నది స్టోరీ..