అమెరికాలో అత్యంత కిరాతకమైన సంఘటన జరిగింది. న్యూయార్ లోని ఓ సబ్ వేలో మహిళకు నిప్పు అంటించాడు ఓ సైకో. ఆమె మంటల్లో తగలబడుతుంటే అక్కడే కూర్చొని చూసి ఎంజాయ్ చేశాడు. ఆదివారం ఉదయం బ్రూ క్లిన్ లోని స్టిల్ వెల్ అవెన్యూ దగ్గర లైన్ చివరలో ఉన్న F ట్రైన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు స్టేషన్ లో ఆగిన నిందితుడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలో సంచలనం కలిగించింది.
నిద్రపోతున్న మహిళకు నిప్పు అంటించిన దుర్మార్గుడు
బ్రూ క్లిన్ లోని స్టిల్ వెల్ అవెన్యూ సబ్ వే దగ్గర ఓ మహిళ నిద్రపోతున్నది. దుండగుడు ఆమె దగ్గరికి వెళ్లి లైటర్ లాంటి వస్తువుతో ఆమె దుస్తులకు నిప్పంటించాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. సదరు మహిళ బాధను తట్టుకోలేక, ఆగి ఉన్న రైల్లోకి వెళ్లింది. అయినప్పటికీ మంటలు ఇంకా వ్యాపించాయి. మంటల్లో కాలుతుంటే తట్టుకోలేక మహిళ గట్టిగా కేకలు వేసింది.
వెంటనే రంగంలోకి దిగిన పెట్రోలింగ్ పోలీసులు
స్టేషన్ పై లెవల్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తమ టీమ్ ను అలర్ట్ చేశారు. వెంటనే మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే మహిళ శరీరం పూర్తిగా కాలిపోయింది. బాధితురాలు 90 శాతానికి పైగా కాలిన గాయాలతో స్పాట్ లోనే ప్రయాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
కాలిపోతున్న మహిళను చూసి ఎంజాయ్ చేసిన సైకో
ఈ ఘటనకు సంబంధించి న్యూయార్క్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సైకో తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని చెప్పుకొచ్చారు. అకారణంగా మహిళకు నిప్పు అంటించడంతో పాటు ఆమె రైల్లోకి వెళ్లి కాలిపోతుంటే, అతడు రైలు బయటే ఫ్లాట్ ఫారం బెంచ్ మీద కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేశాడని చెప్పారు. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. ఈ విజువల్స్ చూసి స్థానికులు నిందితుడికి సంబందించిన సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Watch as @NYPDPC Jessica Tisch and NYPD executives provide an update on an ongoing investigation of a homicide in Brooklyn. https://t.co/0gbfUNBKyW
— NYPD NEWS (@NYPDnews) December 22, 2024
Read Also: రైల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే, మీ మొబైల్ పని అయినట్టే!
బాధితురాలి ఇంకా గుర్తించని పోలీసుల
వాస్తవానికి ఈఘటనలో చనిపోయిన మహిళకు నిందితుడికి అసలు ఎలాంటి సంబంధం లేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. కేవలం సైకో తనంతోనే ఆమెకు నిప్పు అంటించినట్లు చెప్పారు. అటు అనుమానితుడిని పట్టుకోవడంలో సాయం చేసిన స్థానికులను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రశంసించారు. ఇలాంటి హింసాత్మక ఘటలకు సబ్ వేలలో స్థానం లేదని తేల్చి చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తాము కృషి చేస్తామని వెల్లడించారు. అటు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని గ్వాటెమాల నుంచి వలస వచ్చిన సెబాస్టియన్‌గా గుర్తించారు. అతడు 2018లో అరిజోనా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా పోలీసులు తెలిపారు. అటు ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎలన్ మస్క్ కోరారు.
🚨 #BREAKING: The man who set an innocent woman on fire on the New York Subway, Sebastian Zapeta, is a recent “MIGRANT” from Guatemala
The Biden regime REFUSED to deport him, and an innocent woman lost her life as a result.
MASS DEPORTATIONS NOW! pic.twitter.com/hldNzVMz4r
— Nick Sortor (@nicksortor) December 22, 2024
Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..