OTT Movie : మరాఠీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ ఆడియన్స్‌లో మంచి ఓపెనింగ్ సాధించింది. అయితే సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఈ సినిమా లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరమైంది. ఈ సినిమా స్టోరీ ముంబై స్లమ్ ఏరియాలో క్రైమ్ లో చిక్కుకున్న ఇద్దరు యువకులు చుట్టూ తిరుగుతుంది. ఇందులో ముంబై కార్మికుల కుటుంబాల జీవితాలు, క్రైమ్‌లోకి జారే యువతకు సంబంధించిన సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘నే వరణ్‌భాట్ లోంచా కోన్ నే కోంచా’ (Nay varan bhat loncha Kon nay Koncha) అనేది మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మహేష్ మంజ్రేకర్ డైరెక్షన్‌లో, ప్రేమ్ ధర్మాధికారి, వరద్ నాగ్వేకర్, జయంత్ పవార్ నవల ఆధారంగా, చాయా కదమ్, శశాంక్ షెండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 జనవరి 14 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం Zee5, Ahaలో మరాఠీ, హిందీ ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళ్తే
ముంబై స్లమ్ జీవితం గడిపే దిగ్య అనే ఒక అనాథ బాలుడు, తన రౌడీ తండ్రి, బార్ డాన్సర్ తల్లి మరణం తర్వాత అమ్మమ్మతో నివసిస్తుంటాడు. అతని స్నేహితుడు ఇలియాస్ కూడా అనాథ. ఇద్దరూ కలిసి క్రైమ్ లో చిన్న వయసులోనే చిక్కుకుంటారు. దిగ్య తన తండ్రిని చంపిన వ్యక్తిని కనిపెట్టి, రివెంజ్ తీర్చుకోవాలని, గ్యాంగ్‌స్టర్ కావాలని కలలు కంటాడు. అతను తన పిన్నితోనే ఫిజికల్ రిలేషన్‌లోకి దిగుతాడు. అడ్డువస్తున్నారని, ఆమె భర్త వాళ్ల కొడుకును దిగ్య చంపేస్తాడు. ఈ హింసాత్మక జీవితం దిగ్య, ఇలియాస్‌ని మరింత నేర ప్రపంచంలోకి లాగుతుంది.
అమ్మమ్మ వాళ్లను సరిదిద్దడానికి ట్రై చేసినా, ఆర్థిక పరిస్థితులు వాళ్లను నేరపు మార్గంలోనే నడిపిస్తాయి. ఇప్పుడు దిగ్య, ఇలియాస్ లోకల్ గ్యాంగ్‌స్టర్ బాబీతో జట్టు కడతాడు. కానీ దిగ్య బాబీ కూతురుతో అసభ్యంగా కనిపిస్తే, బాబీ కోపంతో అతనితో గొడవపడతాడు. దిగ్య రివెంజ్ లో బాబీని, ఇతరులను చంపుతూ క్రైమ్ లోకంలో ఎదుగుతాడు. కార్పొరేటర్ గవ్డే, శిర్యా , సుప్రియా వంటి పాత్రలు కథని ముందుకు నడిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఒక ఊహించని ట్విస్ట్‌తో దిగ్య డార్క్ జర్నీ ముగుస్తుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? దిగ్య స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ