Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: బంధువర్గంతో చర్చలు జరుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీతండ్రిగారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆలోచనల్లో స్పష్టత కోల్పోతారు. పిత్రృ సమానులైన పెద్ధవారిని కలవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చేరంగు పసుపు రంగు, వేణుగోపాలస్వామి దర్శనం శుభం కలిగిస్తుంది.
వృషభ రాశి: మీ సోదరుల ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. రాజకీయాలతో నలిగి పోతారు. సంతానం మీ మాటలను పెడచెవిన పెడతారు. పై అధికారులతో వాగ్వాదం వల్ల మీ ప్రశాంతతను కోల్పోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య: 6, కలిసి వచ్చేరంగు లేత నీలం రంగు, గోధుమపిండితో ఉండలు నీటిలో కలిపి తర్పణాలు ఇవ్వండి.
మిథున రాశి: మీరు కన్న కలలు నెరవేరుతాయి. విద్యాపరంగా ఆటంకాలు ఉన్నా ఉత్తీర్ణతలో మీ అదృష్టం అని అనుకుంటారు. వస్త్ర నష్టం కలుగుతుంది. అధికారులతో నిజాయితీగా ప్రవర్తించండి. మీ అదృష్ట సంఖ్య 7, కలిసి వచ్చేరంగు పసుపు రంగు, ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించండి.
కర్కాటక రాశి: తొందరపాటుగా మాట్లాడటంతో నష్టాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. మీ కన్నా పెద్ద వారి ముందు ఆటిట్యూడ్ చూపించకండి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చేరంగు: గరుడ పచ్చ రంగు, ముగ్గురు ముత్తయిదువులకు వాయినం ఇవ్వండి.
సింహరాశి: గంగాస్నాన ఫలం కలుగుతుంది. కొత్త భాద్యతలను చేపడుతారు. ఇతరులను ఆకర్షించే మీ విచిత్రమైన పనులు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తారు. మీకు మీరే గొప్పగా ఫీలవుతుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, కలిసివచ్చే రంగు పగడం రంగు, హనుమాన్ దేవాలయంలో అరటిపండ్లు పంచండి.
కన్యారాశి: జూదం మరియు గ్యాబ్లింగ్ వంటి వాటిల్లో పాల్గొని తీవ్ర నష్టాలు చవిచూస్తారు. ఆర్థికంగా పరువాలేదనిపించినా.. అంతర్గత శతృవుల బేదం నిత్యం తొలుస్తూనే ఉంటుంది. జీవిత భాగస్వామి గురించి ఇతరుల ముందు చులకనగా మాట్లాడకండి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2, కలిసి వచ్చేరంగు: పసుపపచ్చ రంగు, జమ్మి చెట్టు ఆకులతో శివాష్టోత్తరం చదువుతూ పూజ పూర్తి చేయండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వారు ఒంటరి ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాహనాల క్రయ విక్రయాలు చేస్తారు. పెండ్లి వేడుకలకు హాజరవుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపురంగు. సుబ్రహ్మణ్య స్వామికి రక్తచందనం పొడిని ఆవుపాలతో కలిపి అభిషేకించడం మంచిది.
వృశ్చికరాశి: మీలో దాచుకున్న రహస్యాలు అప్రయత్నంగా బయటపెడుతారు. ఇంతకు ముందు మీకోసం ఎదురు చూసే మిత్రులు ఎవ్వరూ మిమ్మల్ని కలవటానికి సుముఖంగా ఉన్నట్లు లేదని తెలిసొస్తుంది. ఎవ్వరినీ నమ్మకండి. ఎదుటివారి దగ్గర నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో మళ్ళీ కొత్త ప్రయత్న కార్యాలకు శ్రీకారం చుడుతారు. ఈరోజు మీ అదృష్టసంఖ్య 5, కలిసి వచ్చేరంగు: నెమలి పించం రంగు, కుక్కలకి ఆహారం పంచండి
ధనస్సు రాశి: కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీ లక్కీ నెంబర్ 7, కలిసి వచ్చే రంగు గులాబి రంగు, ఇష్టదేవతారాధన చేయండి
మకరరాశి: మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ మాటకారితనంతో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. సోదరసోదరీమణులతో గొడవలు పెట్టుకోకండి. పెట్టుబడులకు అనూకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, కలిసి వచ్చే రంగు :కాషాయం రంగు, కాలభైరవాష్టకం 8సార్లు చదివి గోవుకి ఆహారం సమర్పించండి.
కుంభరాశి: దూరప్రయాణాలు లాభం చేకూరుస్తాయి. ఆకస్మిక ధననష్టం ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. తినే ఆహారాన్ని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, కలిసి వచ్చేరంగు: గంధం రంగు, దత్తాత్రేయ స్వామి స్తోత్రములు చదవుకుని కోతులకు జిలేబి, క్యారెట్, అరటి పండ్లు పంచండి.
మీనరాశి: సమస్యలు ఎంతగా చుట్టుముట్టినా మీ ప్రయత్నాలలో వెనుకడుగు వేయకండి. అనాథలకు శక్తిమేరకు సహాయం చేయండి. జీవితంపై విరక్తి కలుగుతుంది. ఆత్మీయులు, మిమ్మల్ని కాపాడుకుంటారు. కళ్ళకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 1, కలిసి వచ్చేరంగు: నలుపురంగు, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే