BigTV English

OTT Movie : భర్తను చంపి భార్యతో రొమాన్స్… ఆఖరికి వరసలు కూడా మరచి… వివాదాలతో బ్యాన్ అయిన మూవీ.

OTT Movie : హింస, అశ్లీలత కారణంగా కొన్ని సినిమాలు వివాదాలకు దారితీస్తుంటాయి. చాలా దేశాలలో వివాదాల కారణంగా ఇటువంటి సినిమాలను బ్యాన్ కూడా చేశారు. ఇండియాలో కూడా కొన్ని సినిమాలను నిషేధించడం జరిగింది. 1996 లో రిలీజ్ అయిన ‘ఫైర్’ సినిమాను వివాదాలు చుట్టిముట్టడంతో, ఇండియాలో ఈ మూవీని నిషేధించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ మూవీని హింస, అశ్లీలత కారణంగా మహారాష్ట్ర లో నిషేధించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

యూట్యూబ్ (youtube) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మరాఠీ మూవీ పేరు ‘నే వరణ్‌భట్ లోంచా కోన్ నే కొంచ’ (Nay varanbhat Loncha Kon Nay Koncha). 2022లో విడుదలైన ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. దీనిని NH స్టూడియోజ్ బ్యానర్‌పై శ్రేయాన్స్ హిరావత్ నిర్మించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 14 జనవరి 2022న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

దిగంబర్ అప్పుడప్పుడే టీనేజ్ వయసుకి వస్తూ ఉంటాడు. చిల్లర పనులు చేయడంలో కాస్త ముందు ఉంటాడు. ఒక బామ్మ కూడా ఉంటుంది. ఇతని తండ్రి రౌడీ కావడంతో, ఎవరో కుట్ర చేసి చంపేస్తారు. ఆ తర్వాత తల్లి కూడా కనిపించకుండా పోతుంది. బామ్మ ఇతన్ని చూసుకుంటూ ఉంటుంది. అదే ఇంట్లో అద్దెకు ఉండే ఒక జంట ఆ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటారు. నకిలీ పేపర్లు సృష్టించి ఆ ఇంటిని ఎలాగైనా  పొందాలనుకుంటారు. ఈ విషయం తెలిసి దావ్లే అనే పెద్దమనిషి దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకుంటుంది బామ్మ. వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు దావ్లెే. నిజానికి ఆ పెద్దమనిషికి కూడా ఆ ఇంటిపై కన్ను ఉంటుంది. మరోవైపు బామ్మ మరో కొడుకు ఇంటికి వస్తాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది. పెళ్లి జరిగినా కట్నం కోసం భార్యను వేధించడంతో, భర్తను వదిలి తండ్రి దగ్గర ఉంటుంది కూతురు. వీళ్ళు కూడా ఆ ఇంటిని అమ్మి బాధలు తీర్చుకోవాలని అనుకుంటారు.

అయితే బామ్మకి ఇంటిని అమ్మడం ఇష్టం ఉండదు. ఎలాగైనా ఆ ఇంటిని చేజారకుండా చూడాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఒకరోజు బామ్మ చనిపోయి ఉంటుంది. బామ్మ చావుకి కారణం దావ్లే అని తెలుసుకొని, అతన్ని చంపాలనుకుంటాడు దిగంబర్ . ఒక ప్లాన్ చేసి అతన్ని బయటకు రప్పించి చంపేస్తాడు. అద్దెకు ఉంటున్న వాళ్ళని కూడా చంపి, వాడి పెళ్ళాంతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు బాబాయ్ కూతురుతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు దిగంబర్. వాడు ఏకాంతంగా గడుపుతూ ఉంటే, వీడి ఫ్రెండ్ ఒకడు మరోవైపు గలీజ్ పని చేస్తూ ఉంటాడు. ఇది చూసిన ఆ పిల్ల తండ్రి వీళ్ళు తినే అన్నంలో విషం కలిపి పెడతాడు. చివరికి ఆ అన్నం తిని ముగ్గురూ చనిపోతారు.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×