Urvasi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటి ఊర్వశి రౌటేలా (Urvasi Rautela) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో మెరిసింది.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని ఐటమ్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీ రోల్స్ కూడా చేస్తుంది. అలా బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో పాటు కీరోల్ కూడా పోషించింది.. ఈ ఏడాదిలో బాలయ్య మూవీతో మంచి క్రేజ్ ను అందుకుంది. అయితే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోతుంది ఎవరినో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఈ బాలీవుడ్ బ్యూటీ దబిడి దిబిడి సాంగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో.. అంతకు మించి వివాదాలను కూడా అందుకుంది. అయితే సినిమాల పరంగా కెరీర్ ను దూసుకుపోతుంది.. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్న సామెత సరిగ్గా ఈమెకు సెట్ అవుతుంది. ఒకవైపు వరస సినిమాలతో దూసుకుపోతున్న కూడా మరోవైపు వివాదాలను సతమతమవుతుంది. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఈమె పెళ్లి పీటలు ఎక్కువ పోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియా లో ప్రచారంలో ఉంది. ఈ వార్త విన్న నెటిజన్లు అలాగే ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, సెలబ్రిటీ అయినా ఒర్రీని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అస్సలు నిజం లేదని తెలుస్తుంది. కానీ వార్తలు మాత్రం క్షణాల్లో గుప్పుమంటున్నాయి.
నిజానికి ఈ ఒర్రీతో చాలామంది హీరోయిన్లు క్లోజ్ గా ఫోటోలు దిగుతుంటారు.. పబ్బులకు పార్టీలకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒర్రిని చాలామంది గే అని అంటూ ఉంటారు.కానీ ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు. ఎందుకంటే ఆయనని గే అని అనడానికి కారణం ఆయన ప్రవర్తించే ప్రవర్తనే. తాజాగా ఈమె సోషల్ మీడియా ద్వారా ఒర్రీ కి మెసేజ్ పెట్టింది. ఒర్రి గురించి పెట్టిన ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అవ్వడం తో దీనిపై రియాక్ట్ అయిన ఒర్రీ… నీ పెళ్లి కాదు మన పెళ్లి అనాలి అని రిప్లై ఇచ్చాడు. ఆ పోస్టు మరోసారి వైరల్ అవ్వడంతో బాలయ్య బ్యూటీ ఒక గేర్ ని పెళ్లి చేసుకోబోతున్న అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిజానికి ఊర్వసి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవంటూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. మరి మనసు మార్చుకుని పెళ్లి పీటలు ఎక్కుతుందా లేదా చూడాలి.. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్ లో కీలకపాత్రలో నటించడమే కాకుండా టాలీవుడ్ లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుంది. మొత్తానికి బిజీగా గడుపుతుంది..