E-Paper
Advertisement

అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా
Advertisement

Romantic Revenge Drama: ప్రేమ ఉన్న చోటే పగ కూడా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన రొమాంటిక్ రివేంజ్ డ్రామానే ఈరోజు మన మూవీ సజెషన్. తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా పేరు ‘ఉథరింగ్ హైట్స్’ (Wuthering Heights). మన టైటిల్ కు తగ్గట్టే సినిమా కొంచం వింతగా ఉంటుంది. మరి ఈ విచిత్రమైన స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న డీటైల్స్ ను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ వెస్ట్ యార్క్‌షైర్‌లోని ‘ఉథరింగ్ హైట్స్’ అనే ఎస్టేట్‌లో షురూ అవుతుంది. ఎస్టేట్ యజమాని పేరు మిస్టర్ ఎర్న్‌షా. అతను వీధిలో అనాథగా తిరుగుతున్న ఒక కుర్రాడిని తెచ్చి పెంచుకుంటాడు. అతనికి తన చనిపోయిన కొడుకు పేరు హీత్‌క్లిఫ్ అని పెట్టుకుంటాడు. ఎర్న్‌షా కూతురు క్యాథరిన్ ఎర్న్‌షాకి అది అస్సలు నచ్చదు. అందుకే ఆమె మొదట్లో హీత్‌క్లిఫ్‌ను ఒక పని వాడిగా, చీప్ గా చూస్తుంది. ఆ తరువాత ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. అది కాలక్రమేణా గాఢమైన, విడదీయరాని ప్రేమగా మారుతుంది. దీంతో శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది.

Advertisement

ఇద్దరూ గాఢంగా ప్రేమలో కూరుకుపోతారు. కానీ ఎర్న్‌షా చనిపోయాక ఆమె అన్నయ్య హీత్‌క్లిఫ్‌ను తీవ్రంగా హింసిస్తాడు. సమాజం, ఆస్తి అంతస్తుల కోసం క్యాథరిన్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. పక్కనే ఉన్న అపర కుబేరుడు ఎడ్గార్ లింటన్ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన హీత్‌క్లిఫ్ అదే రోజు రాత్రి ఎస్టేట్ నుండి వెళ్లిపోతాడు. ఐదు సంవత్సరాల తర్వాత హీత్‌క్లిఫ్ విపరీతమైన సంపదతో, ‘ఉథరింగ్ హైట్స్’ ఎస్టేట్‌కు యజమానిగా తిరిగి వస్తాడు.

తనను దూరం చేసుకున్న క్యాథరిన్‌పై, ఆమె కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడమే అతని ఉద్దేశం. ఎడ్గార్ అమాయకపు సోదరి ఇసాబెల్లాను లొంగదీసుకుని, పెళ్లి చేసుకుని ఆమెను నరకయాతన పెడతాడు. క్యాథరిన్ తన పాత ప్రేమను మరచిపోలేక మానసిక వేదనకు గురవుతుంది. వారిద్దరి మధ్య ఉన్న విపరీతమైన వ్యామోహం, పగ ప్రతీకారాలు చివరకు ఎలాంటి వినాశనానికి దారి తీశాయి ? ఆ లవ్ స్టోరీ ఇరు కుటుంబాలను పెట్టిన ఇబ్బందులు ఏంటి ? చివరకు ప్రేమికులు ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

ఈ సినిమా అడాప్టేషన్. ఎమరాల్డ్ ఫెన్నెల్ దర్శకత్వంలో మార్గోట్ రాబీ, జాకబ్ ఎలోర్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ అడాప్టేషన్. ఎమిలీ బ్రోంటే 1847లో రాసిన పాపులర్ నవల ఆధారంగా, కాస్త ఆధునిక హంగులతో, బోల్డ్ టచ్ ఇచ్చి దీన్ని తెరకెక్కించారు. Jiohotstarలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు.

Read Also : వ్యామోహంలో చేసిన తప్పు రివేంజ్ గా మారితే… మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×