OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ని కూడా ఇస్తాయి. అటువంటి సినిమాలు చూస్తున్నప్పుడు, మనసుకి మంచి ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ఓల్డ్ ఫాక్స్‘ (Old Fox). 2023 వచ్చిన ఈ మూవీకి హ్సియావో యా చువాన్ దర్శకత్వం వహించారు. ఇందులో బాయి రన్యి న్, లియు కువాన్టిం గ్, అకియో చెన్, ముగి కడోవాకి యూజీనీ లియు నటించారు. ఈ మూవీ 36వ టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 27 అక్టోబర్ 2023న ప్రదర్శించబడింది. 24 నవంబర్ 2023న తైవాన్‌లో విడుదలైన ఈ మూవీ 60వ గోల్డెన్ హార్స్ అవార్డ్స్‌లో నాలుగు అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
లియో తన తండ్రితో చదువుకుంటూ, తన తల్లి డ్రీమ్ ని ఎలా చెయ్యాలో ఆలోచిస్తుంటాడు. తన తల్లికి ఒక సెలూన్ పెట్టాలని ఆలోచన ఉంటుంది. మధ్యలోనే ఆమె చనిపోవడంతో, భర్తతో పాటు కొడుకు కూడా ఒంటరిగా మిగులుతారు. అయితే కొడుకు తల్లి కోరికను తీర్చడానికి ఏదైనా చేయాలనుకుంటాడు. తండ్రికి అంత స్తోమత ఉండకపోవడంతో ఆలోచనలో పడతాడు. ఆ ప్రాంతంలో షాప్ రెంట్ కి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఉన్న అద్దె ఇంటికి రెంట్ వసూలు చేసేందుకు ఒక లేడీ వస్తుంటుంది. లియో లో ఉన్న ఆలోచనని తన బాస్ కి చేరవేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అతని బాస్ సహాయం చేసేందుకు నిరాకరిస్తాడు. లియో ఆ యజమానితో షాప్ తక్కువ దొరికి ఇవ్వాలని చాలా బ్రతిమాలుతాడు. అంత చిన్న వయసులో కూడా బ్రతిమాలుతూ ఉన్నా కానీ అతని మనసు కరగదు.
లియో ఈ విషయంలో చాలా బాధపడతాడు. ఒకసారి ఆ యజమానికి చిన్న పిల్లాడి మాటలు ఇన్స్పిరేషన్ గా మారుతాయి. అప్పుడు ఇదివరకే ఉన్న ఆ షాప్ ని ఖాళీ చేయిస్తానని చెప్తాడు. అయితే లియో తండ్రి అందుకు ఒప్పుకోడు వాళ్ళు కూడా బ్రతకాలని అనుకుంటాడు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మరికొంత సమయం వెయిట్ చేస్తానని అతనితో చెప్తాడు. చివరికి లియో తన తల్లి కోరికను ఎలా నెరవేరుస్తాడు? ఆ ఊరు యజమాని వీళ్ళకు ఎలా సాయం చేస్తాడు? లియో చివరికి తెలుసుకున్న సత్యం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఓల్డ్ ఫాక్స్’ (Old Fox) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.