BigTV English

Tollywood Heroines : సీక్రెట్ గా పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచినా హీరోయిన్స్ ..?

Tollywood Heroines : సీక్రెట్ గా పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచినా హీరోయిన్స్ ..?

Tollywood Heroines : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి అనేవి కొత్తేమి కాదు.. ఒకప్పుడు సినిమాల పరిచేయమైన వాళ్ల మధ్య ప్రేమ పుట్టడం పెళ్లి చేసుకోవడం కామన్. ఎందరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది హీరోయిన్లు ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి.. కాగా.. ముఖ్యంగా… ప్రేమ వివాహం చేసుకొని… వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు మన తెలుగు చిత్ర పరిశ్రమ లో.. వారెవరో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం…


శ్రీదేవి.. 

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్, స్వర్గీయ నటి శ్రీదేవి గురించి తెలియని వాళ్ళు ఉండరు. శ్రీదేవి రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రమాదవ శాత్తు ఆమె మరణించింది.. ఆమె కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.


జయ ప్రద.. 

తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు.. అయితే ఆమె భర్తకు ముందే పెళ్ళై, పిల్లలు ఉండటంతో తన పెళ్లి విషయాన్ని బయట ఎవరకు చెప్పలేదు..

రమ్య కృష్ణ.. 

హీరోయిన్ రమ్య కృష్ణ సినిమాల గురించి అందరికి తెలుసు. ఇప్పటికి ఆమె అందానికి హీరోయిన్ గా అవకాశాలు రావడం విశేషం.. అందం, అభినయం తో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తో ఉన్న పరిచయం, ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003 లో శుభం కార్డు వేసింది. వీరి పెళ్లి కూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య విడాకులు తీసుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

శ్రీయ శరన్.. 

ప్రేమ, పెళ్లి, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చారు శ్రియా శరణ్.. రష్యా వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని తో బిడ్డను కనేవరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ప్రేమించిన విషయం గానీ, పెళ్లి చేసుకున్న విషయం గానీ, చివరికి సంతానం విషయం గానీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడం తో అంతా ముక్కున వేలేసుకున్నారు.. ఇక వీళ్ళే కాదు ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయ్యారు.. అయితే వీరిలో కొంతమంది సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.. కొందరు సినిమాలతో బిజీ అవుతున్నారు. మరికొందరు అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు.. ఇక కొందరు సినిమాలతో పలకరిస్తున్నారు . సక్సెస్ టాక్ ను అందుకుంటున్నారు.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×