OTT Movies : ఇటీవల ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు కొత్తవి అయితే, మరికొన్ని సినిమాలు పాతవి ఉన్నాయి.. కొత్త సినిమాలు కన్నా పాత సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో కొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లు కొత్త సినిమాలతో పాటు ఆసక్తికర సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎన్నో సినిమాలు స్విమ్మింగ్ కి వచ్చేసాయి. ముఖ్యంగా హారర్ సినిమాలకు ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక సినిమానే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. గత ఏడాది తెలుగులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఓ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. మరి ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం?
మూవీ & ఓటీటీ..
సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నీ తన ఖాతాలో వేసుకున్న శ్రీ విష్ణు ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ హీరో గత ఏడాది ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నవ్వులతో కలెక్షన్లు అదరగొట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతోంది.. శ్రీ విష్ణు, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ ప్లే చేసిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ 2024 మార్చి 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి, తింగరి పనులు ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. దయ్యాలను వదిలించే కాన్సెప్ట్ తో వచ్చిన ఏ మూవీ ప్రేక్షకులను హిలరియస్ గా నవ్వించేసింది.. అప్పట్లో మంచి వస్తువులను రాబట్టడంతో పాటుగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు మరొకటి లోకి రావడం సినీ అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది.సౌత్ సినిమాల ఓటీటీగా పేరు తెచ్చుకున్న సింప్లీ సౌత్ ఫ్లాట్ ఫామ్ లో ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. మే 2 నుంచి ఈ ఓటీటీలోకి ఓం భీమ్ బుష్ రాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రాబోతుంది.
స్టోరీ విషయానికొస్తే..
కామెడీతో కడుపుబ్బ నవ్వించే స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రతి సీను హైలైట్ అయింది. లెగసీ యూనివర్సిటీలో పీహెచ్ డీ స్టూడెంట్స్ గా క్రిష్, వినయ్ గుమ్మడి, మ్యాడీ రేలంగి ప్రయోగాలు చేస్తుంటారు. వీళ్ల టార్చర్ భరించలేక డాక్టరేట్లు ఇచ్చి బయటకు పంపించేస్తారు. ఆ తర్వాత భైరవపురం చేరుకుని బ్యాంగ్ బ్రదర్స్ పేరుతో ఏ టూ జెడ్ సర్వీస్ స్టార్ట్ చేస్తారు.. అయితే ఒక ఊరిలో సంపంగి అనే మహల్ లో ఉన్న నిధిని తీసుకురావాలని వాళ్లకు ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది.. ఆ ఛాలెంజ్ కు ఒప్పుకున్న వాళ్లు ఆ తర్వాత దెయ్యం వలలో చిక్కుకుంటారు. ఎంతో పెళ్లి వరకు వెళ్తారు. దెయ్యం నుంచి ఎలా బయటపడ్డారు తెలియాలంటే ఆ సినిమాని ఒకసారి చూసేయాల్సిందే..