Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. చిరంజీవి 157 వ చిత్రంను సుస్మిత కొణిదెల షైన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయన తదుపరి చిత్రం మెగాస్టార్ తో అని అనౌన్స్ చేయగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం..
మరోసారి చిరంజీవి,నయనతార మూవీ …
అనిల్ రావిపూడి సినిమాలంటేనే సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇక చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీలో చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కనిపించడం విశేషం. అలాగే ఇందులో టాలీవుడ్ బడా హీరో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా ప్రకటించినప్పటి నుండి, ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక అనిల్ రావిపూడి తన చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అందులో భాగంగా మూవీ టీమ్ హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు . చిరంజీవికి జోడిగా ఇద్దరు కథానాయకులు ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు సమాచారం. అందులో ఒక హీరోయిన్ గా నయనతారను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో ఈ పాత్ర గురించి చర్చించినట్లు.. ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అన్ని ఓకే అనుకుంటే, చిరంజీవి, నయనతార కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమాగా తెరకెక్కనుంది.. అదే నిజమైతే హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం.. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయని అంటున్నారు.
హ్యాట్రిక్ హిట్ ..
ఇక చిరంజీవి, నయనతార కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ మూవీ లో ఈమె చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు మూడోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి 157వ మూవీలో నయనతార నటిస్తున్నట్లు సమాచారం. ఈమె తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో నటిస్తున్నారు. వెంకటేష్ తో వచ్చిన లక్ష్మీ సినిమా నుండి, వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంది. బాస్, యోగి, దుబాయ్ శీను, శివాజీ, తులసి, అదుర్స్, శ్రీరామరాజ్యం, అనామిక, బాబు బంగారం, అమ్మోరు తల్లి, పెద్దన్న, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ఆడియోస్ హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి. తాజాగా నయనతార నటించిన టెస్ట్ సినిమా నెట్ ఫ్లిక్ లో ఏప్రిల్ 4వ తేదీన విడుదల అయింది. ఇక చిరంజీవి విశ్వంభరా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చిరు నయన్ కాంబోలో రానున్న మూవీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
#Chiranjeevi And #Nayanthara
#AnilRavipudi #ChiruAnil ✅@KChiruTweets @NayantharaU #BigtvCinema pic.twitter.com/VGHl8ulngX— BIG TV Cinema (@BigtvCinema) May 3, 2025