BigTV English

OTT Movie : ఇది అనాథ కాదురా మావా ఇది ఆడ సైకో… ఒక్కొక్కరిగా ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసే కిల్లర్ గర్ల్

OTT Movie : ఇది అనాథ కాదురా మావా ఇది ఆడ సైకో… ఒక్కొక్కరిగా ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసే కిల్లర్ గర్ల్

OTT Movie : సైకో సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకులకు సైకో రుచి చూపిస్తూ ఉంటారు మేకర్స్. వీళ్ళు చూపించే హింసకి చాలా సినిమాలను, చాలా దేశాలలో బ్యాన్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 35 సంవత్సరాల వయసున్న మహిళ 10 సంవత్సరాల చిన్నపిల్లలాగా కనపడుతుంది. హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ తో ఆమె ఇలా ఉంటుంది. అయితే ఈమె వెన్నులో వణుకు పుట్టించే పనులు చేస్తుంది. అనాధ అని చెప్పుకుంటూ మర్డర్ ఇడ్లీ తిన్నంత ఈజీగా చేసేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో హాట్ స్టార్ (jio hotstar) లో

ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆర్ఫన్: ఫస్ట్ కిల్’  (Orphan : First Kill). 2022 లో రిలీజ్ అయిన ఈ మూవీకి విలియం బ్రెంట్ బెల్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇసాబెల్లె ఫుహర్‌మాన్,  కనగావా, మాథ్యూ ఫిన్‌లాన్, జూలియా నటించారు. 2020 లో కెనడాలోని విన్నిపెగ్‌లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $45 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

లీనా ఒక మానసిక రోగులకు చికిత్స అందించే హాస్పిటల్లో ఉంటుంది. ఈమె ఇదివరకే కొన్ని హత్యలు చేసి ఉంటుంది. అందువల్లే ఆమెను అక్కడ బంధించి ఉంటారు. అయితే చాలా తెలివిగా డాక్టర్ కారులోనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది లీనా. ఆ తర్వాత ఆ డాక్టర్ని కూడా చంపేస్తుంది. ఈమె చూడటానికి చిన్నపిల్లలా ఉంటుంది. వయసు 35 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్నెట్లో చిన్నపిల్లలు తప్పిపోయిన వాళ్ళ అడ్రస్ తెలుసుకొని, అందులో తన ఫేస్ కి సెట్ అయ్యే అమ్మాయి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఒంటరిగా రాత్రి పూట ఒకచోట కూర్చుని ఉంటుంది. పోలీసులు లీనాని చూసి,చిన్న పిల్ల అనుకొని వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఈమె చెప్పిన అడ్రస్ కి వెళ్లి వివరాలు అడిగి లీనాను వాళ్లకు అప్పగిస్తారు.

అయితే తల్లికి ఆమె మీద అనుమానం వస్తుంది. తండ్రి మాత్రం కూతురు తిరిగి వచ్చిందని సంతోషపడతాడు. నిజానికి ఈ జంటకి ఒక కొడుకు, కూతురు ఉంటారు. ఒక ప్రమాదంలో కూతురు చనిపోతుంది. భర్తకు ఈ విషయం చెప్పకుండా, ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ లోనే లీనా వస్తుంది. తల్లికి ఈమె కూతురు కాదని తెలిసినా, ఏమీ అనలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కూతురు వచ్చిందన్న సంతోషంతో భర్త కోలుకుంటున్నాడు. అయితే లీనాది చాలా సైకో మెంటాలిటీ. అక్కడికి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హత్యలు చేస్తుంది. ఇక ఈ ఫ్యామిలీని కూడా లేపేయాలనుకుంటుంది. చివరికి లీనా చేతిలో ఈ ఫ్యామిలీ బలవుతుందా? పోలీసులు లీనాను పట్టుకుంటారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘ఆర్ఫన్: ఫస్ట్ కిల్’  (Orphan : First Kill) అనే ఈ మూవీని చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×