Big TV Kissik Talks : సినీ అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అమ్మగా, అత్తగా, వదినగా, అమ్మమ్మ గా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాటి నుంచి నేటి వరకు వరుసగా సినిమాలు చేస్తుంది. నటిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె ఎన్నో సినిమాల్లో నటించి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ మధ్య సినిమాలే కాదు. బుల్లితెర పై పలు షోలల్లో మెరుస్తూ ఉంటుంది. వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ బిజిగా ఉంటుంది. అయితే అన్నపూర్ణమ్మ అసలు పేరు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూ లో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఆమె ఎలాంటి విషయాల గురించి షేర్ చేసుకుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
బిగ్ టీవీ ఇంటర్వ్యూ..
కిస్సిక్ టాక్స్’ (Kissik Talks) పేరుతో ఒక తెలుగు పోడ్కాస్ట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది బిగ్ టీవీ. ఇందులో మొదటి గెస్ట్ గా వచ్చారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మతో కలిసి సందడి చేసింది హోస్ట్ వర్ష. తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి, ఇండస్ట్రీలో కమిట్మెంట్ గురించి, సినీ కెరీర్ గురించి.. ఇలా చాలా విషయాలను ఈ పోడ్కాస్ట్‌లో పంచుకున్నారు అన్నపూర్ణమ్మ.. ఈ క్రమలోనే ఆమె అసలు పేరు గురించి బయట పెట్టింది. నిజానికి ఇండస్ట్రీలోని చాలా మందికి అన్నపూర్ణ అనే తెలుసు. కానీ ఈమె పేరు అన్నపూర్ణ కాదట.. అసలు పేరు ఉమా మహేశ్వరీ అని బయటపెట్టింది. ఏంటి నిజమా అని ఈ వీడియోను చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఆమె పేరు ఇదా..? అసలు ఎందుకు మార్చుకున్నారు అనే సందేహం కూడా వస్తుంది. అయితే మీరు విన్నది వంద శాతం నిజం. ఇండస్ట్రీలోకి రాకముందు అదే పేరట..
Also Read :వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ‘అతడు ‘ మూవీ.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
ఆమె పేరు మార్చింది ఎవరు..?
అన్నపూర్ణమ్మ తన పదమూడవ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఆమె పేరు బాగోలేదని అనడంతో పేరు మార్చేశారు. ఆమె పేరు అందరికి అర్థం అయ్యేలా ఉండాలని చిత్ర రైటర్ గంగిరెడ్డి ఆమెకు అన్నపూర్ణ అనే పేరు పెట్టారని చెప్పింది. ఈమె నటించిన మొదటి మూవీ స్వర్గం నరకం.. ఎస్ మూవీ టైం లోనే పేరు మార్చినట్లు ఆ ఇంటర్వ్యూ బయటపెట్టింది. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె పేరు గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.. ఇక ఈ ఇంటర్వ్యూ లో తన కూతురు గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నా పాప చనిపోయింది అని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు అన్నపూర్ణమ్మ. ‘ఎవరైనా లేరని తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. వాళ్లు చాలా గుర్తొస్తారు. తెల్లవారుజామున గుర్తొస్తారు. ఏమైనా తినేటప్పుడు గుర్తొస్తారు. వాళ్లకు ఇష్టమైనది మనం తినేటప్పుడు గుర్తొస్తారు అంటూ తన జీవితంలోని చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆ వీడియోలో ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..